- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పవన్ నోట హోంమంత్రి పదవి.. జేసీ ప్రభాకర్‌రెడ్డి రియాక్షన్ ఇదే..!
దిశ, వెబ్ డెస్క్:రాష్ట్రంలో జరుగుతున్న హత్యలు, అత్యాచారాలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy CM Pawan Kalyan) ఆగ్రహం వ్యక్తం చేశారు.రాష్ట్రంలోని లా అండ్ ఆర్డర్‌పై పిఠాపురం(Pithapuram) పర్యటనలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. నేరస్తులపై చర్యలు తీసుకునేందుకు పోలీసులు ఎందుకు ఆలోచిస్తున్నారని ప్రశ్నించారు. చర్యలు తీసుకునే విషయంలో హోంమంత్రి అనిత(Home Minister Anita) బాధ్యత వహించాలని సూచించారు. మీ ఇంట్లో ఆడవాళ్ళను రేప్ చేస్తామని సోషల్‌మీడియాలో పోస్ట్ పెట్టడాన్ని వైసీపీ భావప్రకటన స్వేచ్ఛ అంటోందని మండిపడ్డారు. తాను హోమ్ శాఖ తీసుకుంటే పరిస్థితులు వేరేలా ఉంటాయని హెచ్చరించారు.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలపై టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి (Tadipatri Municipal Chairman JC Prabhakar Reddy) స్పందించారు. గత ఐదేళ్ళలో ఏపీ(Ap)లో లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైందన్నారు. ఇప్పుడు ప్రభుత్వం మారినా ఇంకా అధికారుల తీరు మారడం లేదని వ్యాఖ్యానించారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు వైసీపీకి పూర్తిగా దాసోహమయ్యారని ఆరోపించారు. ఆర్థిక, రాజకీయ ఒత్తిడులకు ఉన్నతాధికారులు తలొగ్గ కూడదని జేసీ ప్రభాకర్ రెడ్డి సూచించారు.