- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ap News: వైసీపీ ఇంఛార్జుల మార్పుపై చంద్రబాబు స్పందన ఇదే..!
దిశ, వెబ్ డెస్క్: మొత్తం 151 మందిని మార్చినా వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్ గెలవరని టీడీపీ అధినేత చంద్రబాబు జోస్యం చెప్పారు. సీఎం జగన్ 11 మంది వైసీపీ ఇంచార్జులను మార్చడంపై ఆయన స్పందించారు. తాడేపల్లి ప్యాలెస్‌లో ఓటమి భయం పట్టుకుందని.. అందుకే 11 మంది ఇంచార్జులను మార్చారని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఒక నియోజకవర్గంలో చెల్లని కాసులు.. మరో చోట చెల్లుతాయా అని ప్రశ్నించారు. ప్రజలను వైసీపీ ఎమ్మెల్యేలు భయబ్రాంతులకు గురి చేశారని.. తిరుగుబాటు మొదలుకావడంతో సీఎం జగన్ మార్పులకు తెరతీశారని చంద్రబాబు ఆరోపించారు. జనాల్లో తీవ్ర వ్యతిరేకత ఉండటంతోనే ఐదుగురు దళిత నేతలను బదిలీ చేశారని వ్యాఖ్యానించారు. బీసీలపై ప్రేమ ఉందని చెప్పుకునే వైసీపీ నాయకులు పులివెందుల సీటును వారికి ఇవ్వమని సీఎం జగన్‌ను అడిగే దమ్ము ఉందా అని ప్రశ్నించారు. బలా బలాలను బట్టే పార్టీ అభ్యర్థుల ఎంపిక ఉంటుందని, కుప్పంలోనూ ప్రజాభిప్రాయం సేకరిస్తామని చెప్పారు. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన వారిని బట్టి నిర్ణయం తీసుకుంటామని చంద్రబాబు స్పష్టం చేశారు.