మంత్రి అమర్‌నాథ్‌ రాజకీయ బిక్ష పెట్టింది చంద్రబాబే: Budda Venkanna

by srinivas |
మంత్రి అమర్‌నాథ్‌ రాజకీయ బిక్ష పెట్టింది చంద్రబాబే: Budda Venkanna
X

దిశ, ఉత్తరాంధ్ర: మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌కి రాజకీయ భిక్ష పెట్టింది తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడేనని టీడీపీ నేత బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. అనకాపల్లి టీడీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా బుద్దా వెంకన్న మాట్లాడుతూ గుడివాడ గురునాథరావు చనిపోయిన తర్వాత ఆ కుటుంబాన్ని వైయస్సార్ బయటకు తోసేశాడని పేర్కొన్నారు. 2004, 2009లో ఆయన భార్యకు ఎమ్మెల్యేగా, గుడివాడ అమర్‌నాథ్‌కు కార్పొరేటర్‌గా సీటు ఇచ్చి రాజకీయ బిక్ష పెట్టినది చంద్రబాబు నాయుడు కాదా అని ప్రశ్నించారు. ఏ కులాన్ని అడ్డం పెట్టుకొని ఎమ్మెల్యే సీట్ తీసుకున్నాడో, అదే కులం ఓట్ల కోసం అడుక్కున్నాడని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పుడు అదే కులానికి చెందిన పవన్ కళ్యాణ్‌ను విమర్శిస్తూ అమర్‌నాథ్ బాగా ఫేమస్ అయ్యాడని ఎద్దేవా చేశారు. ఐటీ మినిస్టర్ అంటే సొంత ఇన్కమ్ టాక్స్ లా అమర్‌నాథ్ వ్యవహారం సాగుతుందని ఆరోపించారు. సొంత నియోజకవర్గంలో కాపుల అభివృద్ధికి గత టీడీపీ హయాంలో ఇచ్చిన భూములను వైసీపీ పార్టీ కార్యాలయానికి ధారాదత్తం చేశాడని అన్నారు.

గుడివాడ అమర్నాథ్ అనే వ్యక్తి ఫస్ట్ అండ్ లాస్ట్ ఎమ్మెల్యే అని, ఈ సారి ఏ నియోజకవర్గంలో పోటీ చేసినా ప్రజలు కచ్చితంగా ఓడిస్తారని వెంకన్న జోస్యం చెప్పారు. గుడివాడ అమర్‌నాథ్ గత ఎన్నికల సమయంలో అఫిడవిట్‌లో దాఖలు చేసిన ఆస్తులు ఎంత? అని, ప్రస్తుత ఆస్తులు ఎంత? అని ప్రశ్నించారు. 'గడిచిన నాలుగు సంవత్సరాల్లో అమర్‌నాథ్ ఏ వ్యాపారం చేస్తే ఇన్ని ఆస్తులు పెరిగాయి?, ఎలా సంపాదించారు అన్నది ప్రజల ముందుకు వచ్చి చెప్పగలరా?' అని ప్రశ్నించారు. అనకాపల్లి మంత్రిగా ఉండి షుగర్ ఫ్యాక్టరీ ఎందుకు నడిపించలేకపోయారు? అని నిలదీశారు. విస్సన్నపేటలో 600 ఎకరాలు కబ్జా చేసి విజయసాయి రెడ్డికి వాటా ఇచ్చి మంత్రి పదవి తెచ్చుకున్నాడని ఆరోపించారు. అనకాపల్లిలో క్వారీ యజమానులను బెదిరించి నెలవారిలు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రైవేట్ లేఔట్‌లో బెదిరింపులకు పాల్పడి వాటాలు అడుగుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్రలో రాయలసీమ తరహా విధానాన్ని అవలంబిస్తున్నా రని బుద్దా వెంకన్న ఆరోపించారు.

Advertisement

Next Story

Most Viewed