- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దేశంలో ఏ లీడర్ నాలా అధినేత కోసం రక్తాభిషేకం చేయలే: బుద్దా వెంకన్న
దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల వేళ విజయవాడ వెస్ట్‌లో రాజకీయాలు వేడెక్కాయి. విజయవాడ వెస్ట్ టికెట్ కోసం టీడీపీ, జనసేనలో తీవ్ర పోటీ నెలకొంది. టికెట్ తమకంటే తమకేనని ఇరుపార్టీల నేతలు దీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ జనసేన, టీడీపీ టికెట్ ఆశావాహులు పోటాపోటీగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. టీడీపీ నేత బుద్ధా వెంకన్న, జనసేన నేత పోతిన మహేష్ ఇవాళ కార్యకర్తలు, అభిమానులతో భేటీ అయ్యారు. ఆత్మీయ సమ్మేళనంలో బుద్దా వెంకన్న మాట్లాడుతూ.. చంద్రబాబు రాముడైతే.. నేను హనుమంతుడినని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇందులో మరో ప్రశ్నకు తావు లేదని స్పష్టం చేశారు. చంద్రబాబుని నేను నాయకుడిగా కన్నా దేవుడిగానే చూస్తానని అన్నారు. దేశంలో ఏ నాయకుడు తనలా అధినేత కోసం రక్తాభిషేకం చేయలేదని చెప్పారు.
విజయవాడ వెస్ట్ టికెట్ తనకు ఇస్తారనకున్నా.. కానీ ఫస్ట్ లిస్ట్‌లో నా పేరు లేకపోవడం బాధ కలిగించిందని అన్నారు. కాగా, టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థుల లిస్ట్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. 118 మంది పేర్లతో ఫస్ట్ లిస్ట్‌ను రిలీజ్ చేయగా.. ఇందులో తీవ్ర పోటీ ఉన్న విజయవాడ వెస్ట్ నియోజకవర్గ అభ్యర్థి పేరు అనౌన్స్ చేయలేదు. విజయవాడ వెస్ట్ టికెట్ కోసం టీడీపీ, జనసేన పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. టీడీపీ నుండి బుద్దా వెంకన్న, జలీల్ ఖాన్ టికెట్ ఆశిస్తుండగా.. జనసేన నుండి పోతిన మహేష్ టికెట్ ఆశిస్తున్నారు. ఈ క్రమంలో విజయవాడ వెస్ట్ టికెట్ హాట్ సీటుగా మారింది.
Read More..
బాబు వద్ద పవన్ కల్యాణ్ కోట్ల రూపాయలు తీసుకున్నాడు: రామ్‌సుధీర్ సంచలన వ్యాఖ్యలు