'మీ ట్రాప్‌లో పడి Jr.ఎన్టీఆర్‌ను తిట్టాల్సిన అవసరం మాకు లేదు'

by GSrikanth |
మీ ట్రాప్‌లో పడి Jr.ఎన్టీఆర్‌ను తిట్టాల్సిన అవసరం మాకు లేదు
X

దిశ, వెబ్‌డెస్క్: మాజీ మంత్రి, వైసీపీ కీలక, గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నానిపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ విషయంలో నాని మైండ్ గేమ్ ఆడుతున్నారని, ఖబడ్దార్ నాని అని హెచ్చరించారు. తమతోనే ఎన్టీఆర్‌ను తిట్టించాలని చూస్తున్నాడని మండిపడ్డారు. నాని ట్రాప్‌లో పడి జూనియర్ ఎన్టీఆర్ తిట్టాల్సిన అవసరం మాకు లేదని స్పష్టం చేశారు. కొడాలి నానితో పార్టీకి కీడు తప్ప మంచి జరుగదని గుర్తించాలని కోరారు. నందమూరి హరికృష్ణ పేరు చెప్పుకుని.. కొడాలి నాని లక్షలు దోచుకున్నారని ఆరోపించారు. ఎన్టీఆర్ కుటుంబం గురించి మాట్లాడే అర్హత నానికి లేదని హెచ్చరించారు.

Next Story

Most Viewed