సమగ్ర భూసర్వే ముసుగులో లక్షకోట్ల అవినీతి.. టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు

by Javid Pasha |
సమగ్ర భూసర్వే ముసుగులో లక్షకోట్ల అవినీతి.. టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు
X

దిశ, డైనమిక్ బ్యూరో : శాశ్వత భూహక్కు, భూరక్ష ..సమగ్రభూసర్వే ముసుగులో లక్షకోట్ల అవినీతికి జగన్ పాల్పడ్డాడు అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమా మహేశ్వరరావు ఆరోపించారు. జగన్ అండ్ కో తమభూదోపిడీ కోసం 22ఏ ను ఆయుధంగా మార్చుకుంది అని ఆరోపించారు. శాశ్వతభూహక్కు పేరుతో ప్రజలభూముల్ని జగన్ శాశ్వతంగా వారికి దూరంచేస్తున్నాడు అని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి దొంగసర్వేలతో ఇప్పటికే 2లక్షల ఎకరాల్ని 22ఏ జాబితాలో చేర్చించాడన్నారు. మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో దేవినేని ఉమా మహేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. అధికారుల్ని భూయజమానులు, సాగుదారుల ఇళ్లకు పంపించి, 22ఏ పేరుతో భయపెట్టి, కారుచౌకగా భూములు కాజేస్తున్నారు అని ధ్వజమెత్తారు.

వివాదాలులేని భూముల్ని కావాలనే 22ఏ జాబితాలో చేర్పించి, తిరిగి వాటిని ఇష్టానుసారం తొలగిస్తూ, భూహక్కుదారుల్ని భయపెట్టి జగన్ అండ్ కో యథేచ్ఛగా భూదోపిడీకి పాల్పడుతున్నారు అని ధ్వజమెత్తారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న 22ఏ జాబితా అవకతవకలపై, వైసీపీ నేతల భూదోపిడీపై, సమగ్రదర్యాప్తు జరగాలి అని బొండా ఉమా మహేశ్వరరావు డిమాండ్ చేశారు. నిన్నటివరకు విశాఖపట్నం చుట్టుపక్కలప్రాంతాలకే పరిమితమైన జగన్ అతని గ్యాంగ్ భూదోపిడీ నేడు రాష్ట్రమంతా వ్యాపించింది. ఎలాంటి వివాదాలులేని భూముల్ని తమకునచ్చినభూముల్ని కబళించడానికి వైసీపీనేతలు 22ఏ జాబితాను ఆయుధంగా వాడుకుంటున్నారు అని ఆరోపించారు.

భూముల్ని ఇష్టానుసారం 22ఏ జాబితాలో చేర్చడానికి వీల్లేదన్నహైకోర్టు తీర్పుని, గతప్రభుత్వ నిబంధనల్ని జగన్ అండ్ కో తమదోపిడీకోసం తుంగలో తొక్కేశారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ తీసుకొచ్చిన భూహక్కు-భూరక్ష పథకంపేదల భూముల్ని కాజేయడానికేనని మండిపడ్డారు. ప్రజలు తరతరాలనుంచి సాగుచేసుకుంటున్నభూముల్ని 22ఏ జాబితా ముసుగులో వైసీపీ భూబకాసురులు స్వాహాచేస్తున్నారు. టీడీపీప్రభుత్వం వచ్చిన వెంటనే జగన్ అండ్ కో చెరబట్టిన భూముల్ని విడిపించి, దోషుల్ని కఠినంగా శిక్షించి, పేదలకు న్యాయంచేస్తుంది అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమా మహేశ్వరరావు హామీ ఇచ్చారు.

Advertisement

Next Story