- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నా పాస్‌బుక్‌పై అవినీతిపరుడి బొమ్మేంటి?.. టీడీపీ నేత బండారు ఫైర్
- జగన్ బొమ్మతో నా భూమిలో వేసిన సర్వే రాయి తొలగించకపోతే కోర్టుకు వెళ్తా
- ముదపాక ల్యాండ్ పూలింగ్‌లో నా ప్రమేయం ఉందని తేలితే తల నరుక్కుంటా
దిశ, డైనమిక్ బ్యూరో: వైఎస్ జగన్ పాలనలో రైతుల భూములకు భద్రత లేకుండా పోయిందని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి అన్నారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు - భూరక్ష (రీ సర్వే) పత్రాల పంపిణీ కార్యక్రమంపై బండారు సత్యనారాయణ విమర్శలు చేశారు. 'మీ భూమి - మా హామీ'కి బదులు 'మీ భూమి - నా భూమి' అని పెడితే బాగుండేదని ఎద్దేవా చేశారు. అంతేకాదు రిజిస్ట్రేషన్ చేయాలంటే వలంటీర్ సంతకం పెట్టాలన్న నిర్ణయం అత్యంత దారుణమన్నారు. సర్వే అండ్ సెటిల్‌మెంట్ డిపార్ట్‌మెంట్ పేరు పలకడం కూడా చేతకానీ సీఎం వైఎస్ జగన్ రెవెన్యూ శాఖను పూర్తిగా భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి కావడం రాష్ట్ర ప్రజల ఖర్మ అంటూ విమర్శలు చేశారు. స్పందనలో వచ్చిన రెవెన్యూ దరఖాస్తులు పరిష్కారానికి నోచుకోలేకపోయినప్పటికీ ఏకంగా 90శాతం సమస్యలు పరిష్కారం అవుతున్నాయని సీఎం జగన్ అసత్యాలు చెప్తున్నారని మండిపడ్డారు. స్పందనలో సమస్యలు పరిష్కరించకపోవడం వల్లే కదా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాకాలో ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని గుర్తు చేశారు.
మరోవైపు ముదపాక ల్యాండ్ పూలింగ్‌లో అక్రమాలకు పాల్పడ్డారన్న వైసీపీ ఆరోపణలపై బండారు మండిపడ్డారు. ఆ వ్యవహారంలో తన తప్పు ఉందని తేలితే తల నరుక్కుంటానంటూ సవాల్ విసిరారు. అంతేకాదు నా పాస్ బుక్‌పై ఓ అవినీతిపరుడి బొమ్మా.. ఆయనేమైనా మాకు భూమి ఇచ్చారా?. ఆయన బొమ్మతో నా భూమిలో సర్వే రాయి పెట్టడం ఏంటి?. పాస్ బుక్, సర్వే రాళ్లపై బమ్మలు తీయించకపోతే కోర్టుకు వెళ్తానని హెచ్చరించారు. సర్వే రాళ్లపై బొమ్మలనేది ఓ పెద్ద స్కామ్ అని మాజీమంత్రి బండారు సత్యనారాయణ మూర్తి ఆరోపించారు.