- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీడీపీ, జనసేన మేనిఫెస్టో విడుదల.. రైతులకు భారీ గుడ్ న్యూస్
దిశ, వెబ్‌డెస్క్: 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేనాని పవన్ కల్యాణ్, బీజేపీ కీలక నేతలు కలిసి ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో కీలక అంశాలను మీడియాకు వివరించారు. ఈ మేనిఫెస్టోలో కూటమి ప్రభుత్వం రైతులకు పెద్దపీట వేసింది. రాష్ట్రంలో జరుగుతున్న రైతు ఆత్మహత్యలను అరికట్టేందుకు.. రైతులకు ఏటా రూ. 20,000 వేల పెట్టుబడి సాయం అందించనున్నట్లు చంద్రబాబు నాయుడు తెలిపారు. అలాగే ఈ మేనిఫెస్టో తో బీజేపీకి సంబంధం లేదని.. ఇది కేవలం జనసేన, టీడీపీ ఉమ్మడి మేనిఫెస్టోనని.. దీనికి బీజేపీ పూర్తి మద్దతు ఉంటుందని బాబు చెప్పుకొచ్చారు. నేషనల్ పార్టీ అయిన బీజేపీ రాష్ట్రంలో స్పెషల్ మేనిఫెస్టో ఉండదని బాబు క్లారిటీ ఇచ్చారు.