TDP: జగన్ మూల్యం చెల్లించుకోక తప్పదు.. ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఫైర్

by Ramesh Goud |
TDP: జగన్ మూల్యం చెల్లించుకోక తప్పదు.. ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ, చత్తీస్‌గఢ్ కుంభకోణాలు చిన్నబోయేలా జగన్ మద్యం అక్రమాలకు పాల్పడ్డాడని, దీనికి జగన్ మూల్యం చెల్లించుకోక తప్పదని వినుకొండ టీడీపీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. మద్యం విధానం సంస్కరణల పట్ల వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలపై స్పందించిన ఆయన జగన్ పై ఫైర్ అయ్యారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజలు వైసీపీ కాళ్లు విరగ్గొట్టి మూలన కూర్చొబెట్టినా జగన్ కు ఏ మాత్రం బుద్ది రాలేదని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో రూ.1.24 లక్షల కోట్ల మద్యాన్ని నగదు రూపంలో అమ్మారని సంచలన ఆరోపణలు చేశారు. అలాగే వైసీపీ సర్కార్ డిస్టిలరీలను గుప్పిట్లో పెట్లుకొని ప్రజల గొంతులో విషం పోశిందని, కల్తీ, నాసిరకం మద్యంతో 30 వేల మందికి పైగా ప్రాణాలు తీశారని మండిపడ్డారు. వీటికి ముగింపు పలికేందుకు మద్యం విధానం సంస్కరించాలని చూస్తుంటే తప్పుడు ప్రచారాలు చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక జగన్, విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, వాసుదేవ రెడ్డి చేసిన పాపాలు అన్నీ ఇన్నీ కావని, వీటన్నింటికీ మూల్యం చెల్లించుకోక తప్పదని జీవీ ఆంజనేయులు హెచ్చరించారు.

Advertisement

Next Story