- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ నియోజకవర్గంలో రోజురోజుకు మరింత బలపడుతున్న టీడీపీ..
దిశ,అన్నవరం:ప్రత్తిపాడు నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించక ముందు వైసీపీ బలంగా ఉండేది. పలు సర్వేల ఆధారంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని భావించిన పార్టీ అధిష్టానం నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే ను కాదని నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతలు ఇటీవల వరుపుల సుబ్బారావుకి అప్పగించింది. దీంతో సుబ్బారావు నియోజకవర్గం లోని ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలకు హాజరవడంతో పాటు నియోజక వర్గంలో ప్రచారాన్ని ముమ్మరం చేశారు.దీంతో నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందనే ధీమా ఆ పార్టీ శ్రేణుల్లో బలంగా నాటుకుంది. ఇంతలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా దివంగత వరుపుల రాజా సతీమణి వరుపుల సత్య ప్రభను పార్టీ అధిష్టానం ప్రకటించడంతో తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం కనిపించింది.
టీడీపీ టికెట్ ఎప్పుడైతే వరుపుల సత్య ప్రభకు దాదాపు ఖరారు అయిందో పార్టీ కార్యక్రమాల్లో ఇతర కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని ప్రచారం హోరెత్తించారు.దీంతో నియోజకవర్గంలో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి.వైసీపీ పార్టీ నుంచి ప్రతి మండలంలో గ్రామంలో నాయకులు కార్యకర్తలు దగ్గర నుంచి ముఖ్యమైన నేతలు వరకు టీడీపీ తీర్థం పుచ్చుకోవడం మొదలుపెట్టారు. దీని అంతటికి ప్రధాన కారణం ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వరుపుల సుబ్బారావు మంచితనమేనా! అంటూ నియోజకవర్గంలో ప్రజలు గుసగుసలు ఆడుకుంటున్నారు.సార్వత్రిక ఎన్నికలకు సమయం చాలా తక్కువగా ఉన్నందున ఇరు పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి.
ఇంతవరకు నియోజకవర్గంలో వైసీపీ పార్టీ విజయం ఖాయం అనుకున్న నేపథ్యంలో ఆ పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు నేతలు కార్యకర్తలు మెల్లగా పార్టీ నుంచి జారుకోవడం మొదలుపెట్టారు. ఇప్పటికే మండల స్థాయిలో ఉన్న నాయకులు టీడీపీ తీర్థం పుచ్చుకొని వరుపుల సత్యప్రభ వెంట ప్రచారానికి దిగుతున్నారు.ఇదిలా ఉండగా వైసీపీలో ఉన్న నియోజకవర్గ ముఖ్యమైన నేత టీడీపీకి పరోక్షంగా మద్దతిస్తున్నారు? అన్న ఊహాగానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ బలమైన గాలి వీస్తుండడంతో నియోజకవర్గంలో మండల స్థాయి నాయకులు గ్రామ స్థాయి నాయకులు కూడా టీడీపీ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అలాగే నియోజకవర్గంలో పలు గ్రామాల్లో సైతం ఇరు పార్టీల నాయకులు రోజుకో పార్టీలో బూటకపు చేరికలు చేరుతున్నారు. మొన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న నాయకులే నేడు టీడీపీ తీర్థం పుచ్చుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
Read More..