- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AP:కూటమి ప్రభుత్వం పై ఎంపీ అవినాష్ రెడ్డి విమర్శలు.. స్పందించిన టీడీపీ ఇంచార్జ్
దిశ, వెబ్‌డెస్క్:ఏపీలో ఇటీవల కడప ఎంపీ అవినాష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తాజాగా పులివెందుల టీడీపీ ఇంచార్జ్ బీటెక్ రవి స్పందిస్తూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పులివెందులలో ఇష్టానుసారంగా జూదం నడిపిస్తున్నారని, కూటమి ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లో అరాచక పాలన నడుస్తోందని కడప ఎంపీ అవినాష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బీటెక్ రవి తీవ్రంగా ఖండించారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. గత ఐదేళ్ల వైసీపీ పాలనపై విమర్శలు గుప్పించారు. గత ఐదేళ్లలో మట్కా డబ్బులతో ఫ్లెక్సీలు కట్టించుకుంది ఎవరో పులివెందుల ప్రజలకు తెలుసన్నారు. అంతేకాదు అక్రమ మైనింగ్ వ్యాపారం చేసింది కూడా వైఎస్ కుటుంబమే అని బీటెక్ రవి వ్యాఖ్యానించారు. వైఎస్ కుటుంబం రాజకీయ పునాదులు అక్రమ మైనింగ్ ద్వారా మొదలైందని విమర్శించారు. పులివెందులకు వైఎస్ జగన్ చేసింది ఏం లేదని.. కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని టీడీపీ ఇంచార్జ్ బీటెక్ రవి వ్యాఖ్యానించారు.