- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TDP: కళ్లుంటే ఈ లెక్కలు చూడు జగన్.. మంత్రి నారాలోకేశ్ సంచలన వ్యాఖ్యలు
దిశ, డైనమిక్ బ్యూరో: ఫేక్ జగన్ వరద సహాయక చర్యలపై విషం కక్కుతున్నాడని, ఎగ్ పఫ్ లు పందికొక్కులా మెక్కిన జగన్ ఇకనైనా ఫేక్ ప్రచారాలు మానుకోవాలని మంత్రి నారా లోకేశ్ అన్నారు. "ముంపులోనూ మేసేశారు" అని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వార్తకు సంబంధించిన ఫోటోపై స్పందించిన ఆయన వరద సహాయానికి సంబంధించిన లెక్కలను ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీ అధినేత జగన్ పై ఫైర్ అయ్యారు. దీనిపై ఫేక్ జగన్ వరద బాధితులకు ఇస్తామన్న కోటిలో ఒక్క రూపాయి కూడా ఇప్పటికీ ఇవ్వలేదని, వరద బాధితులకు ఒక వాటర్ ప్యాకెట్ కానీ, ఒక బిస్కెట్ ప్యాకెట్ కానీ పంపిణీ చేయని ఫేక్ జగన్ వరద సహాయక చర్యలపై విషం కక్కుతున్నాడని మండిపడ్డారు.
అలాగే వరద ప్రాంతాల్లో కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలకు 23 కోట్లు అంటూ ఫేక్ ప్రచారం చేయిస్తున్నాడని, వీటికి ఖర్చు 23 లక్షలు కూడా కాలేదని వివరించారు. కూటమి ప్రభుత్వానివి.. జగన్ చీకటి పాలనలో వెలువడిన చీకటి జీవోలు, చీకటి లెక్కలు లాంటివి కాదని విమర్శించారు. ఇవిగో ఖర్చుల లెక్కలు.. అన్నీ పారదర్శకంగా ఉన్నాయని, చదువు వస్తే చదువుకో.. కళ్ళుంటే చూడు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక తాడేపల్లి ప్యాలెస్ కలుగులో దాక్కుని ప్రజాధనం కోట్లు పందికొక్కులా ఎగ్ పఫ్‌లు మెక్కి, నిమ్మకాయ నీళ్లులా తాగేసిన ఫేక్ జగన్ ఇకనైనా నీ ఫేక్ ప్రచారాలు ఆపు అని లోకేశ్ వ్యాఖ్యానించాడు.