సజ్జలకు ఈసీ బిగ్ షాక్.. సీఐడీ విచారణకు ఆదేశం

by Disha Web Desk 16 |
సజ్జలకు ఈసీ బిగ్ షాక్.. సీఐడీ విచారణకు ఆదేశం
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో వైసీపీ, టీడీపీ మధ్య ఫిర్యాదుల పర్వం నడుస్తోంది. ఒక పార్టీపై మరో పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నాయి. దీంతో ఎన్నికల సంఘం విచారణకు ఆదేశిస్తోంది. అంతేకాదు సీఐడీని రంగంలోకి దింపుతోంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై దుష్ప్రచారం చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. దీంతో సీఐడీ విచారణకు ఈసీ అధికారులు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు టీడీపీ నేతలపై సీఐడీ అధికారులు కేసులు నమోదు చేశారు. ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా ఇంచార్జి, సజ్జల రామకృష్ణ తనయుడు భార్గవ రెడ్డిపై ఈసీకి టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ఇంటింటికీ పింఛన్లు అందకపోవడానికి చంద్రబాబునే కారణమని ప్రచారం చేస్తున్నారని ఎన్నికల సంఘం అధికారులకు టీడీపీ నేత వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు. ఐవీఆర్ఎస్ ద్వారా ఓటర్లు, పింఛన్ దారులను తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. వైసీపీ సోషల్ మీడియా ద్వారా విద్వేషాలు రగిల్చేలా తప్పుడు ప్రచారం చేశారని, సజ్జల భార్గవ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఈసీని కోరారు. వర్ల ఫిర్యాదు మేరకు ఐవీఆర్ఎస్ కాల్స్‌పై సీఐడీ దర్యాప్తునకు ఎన్నికల సంఘం ఆదేశించింది. విచారణ చేసి వెంటనే నివేదిక ఇవ్వాలని సీఐడీ డీజీకి ఆదేశాలు జారీ చేసింది.

Read More..

AP Politics:ప్రజా సంక్షేమానికే ప్రాధాన్యత..కాపులకు వైసీపీ పెద్దపీట వేసింది: వైసీపీ అభ్యర్థి

Next Story

Most Viewed