- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై చంద్రబాబు సంచలన నిర్ణయం
దిశ, వెబ్ డెస్క్: సీఎం జగన్ మోహన్ రెడ్డి తీసుకొచ్చిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రకాశం జిల్లా పొదిలిలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌ను రద్దు చేస్తానని చెప్పారు. తొలి సంతకం డీఎస్సీపైనేనని, రెండో సంతకం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దుపైనే పెడతానని హామీ ఇచ్చారు. తిరుపతి నుంచి స్మగ్లర్‌ను పొదిలికి తీసుకొచ్చారని, దాని వల్ల నల్లమల్ల అడవిలో ఎర్రచందనం మాయమయ్యే పరిస్థితికి వచ్చిందని చెప్పారు. రాష్ట్రంలో అరాచకాలు పెరిగియపోయాయని వ్యాఖ్యానించారు. ఇసుక, మద్యం, గనుల మాఫియా డబ్బంతా సీఎం జగన్ కే వెళ్తోందని చంద్రబాబు ఆరోపించారు.
వృద్ధుల కష్టాలకు సీఎం జగనే కారణమని చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలో ఉన్న లక్షా 50 వేల మంది సచివాలయ ఉద్యోగులకు ఇంటి వద్దనే పింఛన్లు అందించవచ్చని.. కావాలనే వృద్ధులు, వికలాంగులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. పెన్షన్ కోసం వృద్ధులను మండుటెండల్లో తిప్పి చంపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పింఛన్‌దారుల మరణాలన్ని ప్రభుత్వ హత్యలేనని చంద్రబాబు ధ్వజమెత్తారు. ప్రభుత్వ ఉద్యోగులను వేధించారని.. వారిపై మొత్తం 1500 కేసులు పెట్టారని చెప్పారు. గతంలో తండ్రి లేని బిడ్డ అని అన్నాడని, ఆ తర్వాత కోడి కత్తి డ్రామా ఆడారని, ఇప్పుడు గులకరాయి నాటకం ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. పట్టాదారు పాస్ పుస్తకాలపై జగన్ బొమ్మ ఏంటని ప్రశ్నించారు. సర్వే రాళ్లపైనా జగన్ బొమ్మ అరాచకానికి పరాకాష్ట అని చంద్రబాబు మండిపడ్డారు.
Read More..
2024 Elections: నిరుద్యోగులు, ఉద్యోగులకు చంద్రబాబు గుడ్ న్యూస్