మచిలీపట్నం-రేపల్లె మధ్య రైల్వే లైన్‌పై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

by Disha Web Desk 16 |
మచిలీపట్నం-రేపల్లె మధ్య రైల్వే లైన్‌పై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: తాము అధికారంలోకి వస్తే మచిలీపట్నం- రేపల్లె మధ్య రైల్వే లైన్ ఏర్పాటు చేయిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. మచిలీలపట్నంలో పవన్ కల్యాణ్ కలిసి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ వైఎస్ వివేకానందారెడ్డిపై గొడ్డలివేటు ఎవరు వేశారో చెప్పాలని, ఆ తర్వాతే ఓట్లు అభ్యర్థించాలని డిమాండ్ చేశారు. శిరోముండనం కేసులో శిక్ష పడిన వ్యక్తికి సీటు ఎలా ఇచ్చారని ప్రవ్నించారు. ఐదేళ్లుగా విధ్వంసం రాజకీయాలు చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో రౌడీయిజం, అవినీతి, రాజ్యమేలిందని ఎద్దేవా చేశారు. తాము అధికారంలోకి మచిలీపట్నం పోర్టును పూర్తి చేసే బాధ్యతను తీసుకుంటామని చెప్పారు. ప్రజల మేలు కోసమే కూటమిని ఏర్పాటు చేశామన్నారు. పవన్ కల్యాణ్ కు చాలా రకాల బెదిరింపులు వచ్చాయని.. అయినా ధైర్యంగా నిలబడ్డారని చంద్రబాబు పేర్కొన్నారు. కృష్ణా జిల్లా నుంచి ఇద్దరు మంత్రులు పని చేశారని గుర్తు చేశారు. ఒకరు బూతులు నాని అయితే మరొకరు నీతులు నాని అని ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్‌ను, తనను తిట్టడమే వాళ్ల పని అని సెటైర్లు వేశారు. బందర్ అభివృద్ధికి ఏం చేశారో చెప్పే దమ్ము, ధైర్యం వైసీపీ నాయకులకు ఉందా అని చంద్రబాబు ప్రశ్నించారు.

Next Story

Most Viewed