- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చంద్రబాబుపై హత్యాయత్నం నిందలు.. బయటపడ్డ అసలు విషయాలు
దిశ, వెబ్ డెస్క్: ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుపై సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హత్యాయత్నం నిందలు వేసిన విషయం తెలిసిందే. అయితే ఆవన్నీ కూడా దుష్ప్రచారమే అని తేలింది. వైఎస్ వివేకానందారెడ్డి హత్య, కోడికత్తి దాడి విషయంలో చంద్రబాబునే చేయించారని గత ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతి సభ, ర్యాలీ, రోడ్ షోల్లో ప్రచారం చేశారు. అయితే జగన్ అధికారంలోకి రావడంతో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో రాష్ట్ర ప్రజలందరికీ అర్ధమైంది. కోడి కత్తి దాడి, వివేకా హత్య నిందితులెవరు.. జైలుకు ఎవరు వెళ్లారు.. తప్పించుకుని ఎవరు తిరుగుతున్నారనేది ప్రతి ఒక్కరికీ తెలిసిపోయింది. అయినా ఈ కేసుల విషయంలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు హాస్యాస్పదం అవుతున్నాయి. ఇటీవల జరిగిన గులకరాయి దాడిలో విషయంలోనూ జగన్ చేసిన ఆరోపణలు బూమరాంగ్ అయ్యాయి. బ్యాండేజ్ ఎక్కువ రోజులు పెట్టుకోవడం కూడా హాస్యాస్పదం అయింది. ప్రస్తుత ఎన్నికల్లో ఈ అంశాలే ప్రతిపక్ష నాయకుడు, చంద్రబాబుకు ఆయుధంగా మారాయి. ఇక కోడి కత్తి దాడి విషయంలోనూ తనపై నిందలు మోపారని, అసలు దొంగలు ఎవరో అందరికీ తెలిసిపోయిందని చంద్రబాబు రాష్ట్రమంతా తిరుగుతూ జగన్ పరువు తీసేస్తున్నారు.
నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ప్రజాగళం బహిరంగ సభలో పాల్గొన్న చంద్రబాబు.. గులకరాయితో హత్యాయత్నం చేశానని తనపై నిందలు వేశారని మండిపడ్డారు. కోడి కత్తితో హత్యాయత్నం చేశానని అప్పుడూ కూడా ఇలానే నిందలు వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వివేకానందారెడ్డి హత్యలోనూ తనపై అభాండాలు వేశారని ధ్వజమెత్తారు. ఇప్పుడు అసలు విషయాలన్నీ వెలుగులోకి వచ్చాయన్నారు. సూత్రదారులు, నిందితులు ఎవరో అందరికీ తెలిసిపోయిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
గత ఎన్నికల ముందు జగన్ ఇచ్చిన హామీలను ప్రశ్నిస్తూ చంద్రబాబు విమర్శలు కురిపించారు. వైసీపీ మేనిఫెస్టో విడుదలతో పాలనపై సీఎం జగన్ మోహన్ రెడ్డి చేతులెత్తాశారని ఆరోపించారు. మేనిఫెస్టోలో రైతులకు ఏమీ చెప్పని దుర్మార్గుడు జగన్ అని విమర్శించారు. గత మేనిఫెస్టోలో మద్యపాన నిషేధం, పోలవరం పూర్తి, వారంలోగా సీపీఎస్ రద్దు, నిరుద్యోగుల ఉద్యోగాల హామీలను నెరవేర్చలేకపోయారని ఎద్దేవా చేశారు. జగన్ నవరత్నాలు.. నవ మోసాలని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
Read More..