Breaking: మంత్రి ధర్మానపై ఈసీకి ఫిర్యాదు

by srinivas |   ( Updated:2024-02-22 14:41:18.0  )
Breaking: మంత్రి ధర్మానపై ఈసీకి ఫిర్యాదు
X

దిశ, వెబ్ డెస్క్: ఎన్నికల విధుల్లో వాలంటీర్లు పాల్గొనవచ్చని మంత్రి ధర్మాన ప్రసాద్ రావు చేసిన వ్యాఖ్యలను టీడీపీ తప్పుబట్టింది. ఎన్నికల విధులకు వినియోగించొద్దని ఎన్నికల సంఘం ఆదేశాలను మంత్రి ధర్మాన బేఖాతారు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఎన్నికల సంఘానికి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. ప్రభుత్వానికి అనుకూలంగా వాలంటీర్లు పని చేయాలని బహిరంగంగా మంత్రి చెప్పడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని కోరారు. ఎన్నికల సంఘం ఆదేశాలను ఉల్లంఘించిన మంత్రి ధర్మాపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని లేఖలో అచ్చెన్నాయుడు విజ్ఞప్తి చేశారు.


Read More..

మొబిలైజేషన్ ముగింపు వేడుకల్లో పాల్గొన్న : జిల్లా ఎస్పీ

Advertisement

Next Story