- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Big Breaking: దూకుడు పెంచిన టీడీపీ-జనసేన..త్వరలో ఉమ్మడి భారీ బహిరంగ సభ
దిశ డైనమిక్ బ్యూరో: ఎన్నికల సమయం దగ్గర పడడంతో తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జోష్ పెంచారు. జనసేన పార్టీతో పొత్తు కలుపుకున్న చంద్రబాబు సీట్ల కేటాయింపు విషయంలో విబేధాలు రాకుండా అభ్యర్థులను ప్రకటించేందుకు వారం రోజులుగా సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో భేటీ కానున్నారు.
ఇక ఇప్పటికే రెండు మూడు సార్లు పవన్ తో భేటీ అయిన చంద్రబాబు సీట్ల కేటాయింపు పై చర్చించారు. ఈ నేపథ్యంలో సీట్ల కేటాయింపు పై స్పష్టత వచ్చినట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ అభిప్రాయాలను గౌరవించి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక పవన్ కళ్యాణ్ కూడా సీట్ల కేటాయింపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఏదేమైనా మరో వారం పది రోజుల్లో అభ్యర్థులను ప్రకటించేందుకు ఇరు పార్టీల అధినేతలు ఓ అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం.
అయితే ఇప్పటి వరకు అటు చంద్రబాబు కానీ ఇటు పవన్ కానీ ఈ అంశానికి సంబంధించిన ఏ విషయం కూడా అధికారికంగా ప్రకటించలేదు. కాగా ఈ రోజు మరోసారి జనసేన పార్టీ అధినేతతో పవన్ కళ్యాణ్ తో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి సీట్ల కేటాయింపుపై చర్చించనున్నారు. ఇది వరకు జరిగిన సమావేశాల్లో టీడీపీ జనసేనకు 25 స్థానాలను ఇచ్చేందుకు నిర్ణయించింది.
అందుకు అప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పవన్ మరోసారి పేచీ పెట్టినట్లు సమాచారం. తనకు ఇంకా కొన్ని ఎక్కువ స్థానాలు కావాలని కోరిన పవన్.. ఉభయ గోదావరి.. విశాఖలో ఎక్కువ సీట్లను ఆశిస్తున్నారని తెలుస్తోంది. ప్రతి పార్లమెంట్ స్తానం నుండి సీటు కావాలని జనసేన కోరుతున్నట్లు సంబంధిత వర్గాల నుండి సమాచారం అందుతోంది. అయితే ఇప్పటికే ఓ కొలిక్కి వచ్చిన ఇరు పార్టీల అధినేతలు ఈ రోజు జరగనున్న సమావేశంలో తుది నిర్ణయానికి రానున్నారు.
ఏదేమైనా మరో రెండు మూడు రోజుల్లో ఏ విషయం ఇరుపార్టీల అధినేతలు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక సీట్ల కేటాయింపుపై ద్రుష్టి సారించిన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గత మూడు రోజుల నుండి హైదరాబాద్ లోనే ఉన్నారు. ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో వీలైనంత త్వరగా అభ్యర్థులను ప్రకటించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు.
ఇందుకోసం ఈ రోజు తుది నిర్ణయం తీసుకోనున్నారు. అలానే ఇప్పటి వరకు 17 రా కదిలిరా భహిరంగ సభల్లో పాల్గొన్న చంద్రబాబు మరో రెండు మూడు రా కదిలిరా భహిరంగ సభల్లో పాల్గొననున్నారు. అలానే జనసేన, టీడీపీ కలిసి అతి త్వరలో భారీ ఉమ్మడి బహిరంగ సభను నిర్వహించనున్నట్లు సమాచారం.