- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
YCP: లోకేష్‌ని సీఎంని చేసే ప్రయత్నంలో చంద్రబాబు..? విజయసాయిరెడ్డి సంచలన ట్వీట్
దిశ, డైనమిక్ బ్యూరో: మూడేళ్లలో రాష్ట్రాన్ని దోచుకోవడంలో టీడీపీ(TDP) నిమగ్నమైందా అని, చంద్రబాబు(CM Chandrababu Naidu) లోకేష్(Lokesh Nara)ని సీఎం చేసే ప్రయత్నంలో ఉన్నారా అని మాజీ ఎంపీ, వైసీపీ నేత విజయసాయిరెడ్డి(Vijayasai Reddy) ప్రశ్నించారు. జమిలి ఎన్నికల(Jamili Elections)పై స్పందిస్తూ.. టీడీపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై విజయసాయిరెడ్డి.. ఏపీలో ఏదో రకంగా నాలుగున్నర సంవత్సరాలు బతికి బట్టకట్టాలని, టీడీపీ తాపత్రయపడుతోందని అన్నారు. "జమిలి.. జమిలి.. 2027లో ఎన్నికలు" అంటూ సమాచారం వస్తున్న నేపథ్యంలో ఈ మూడు సంవత్సరాల్లో రాష్ట్రాన్ని దోచుకోవడంలో టీడీపీ నిమగ్నమైందా అని, టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తెలుగు తమ్ముళ్ల, దందాలు, దోపిడీలు, మోసాలు, హత్యలు, రేప్‌లు చూసి టీడీపీకి ఎందుకు ఓటు వేశామా అని ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారా అని పలు ఆరోపణలు చేశారు.
అలాగే కూటమి పార్టీల ముఖ్యనాయకులు, కార్యకర్తల మధ్య సయోధ్య లేక అవినీతి దొంగసొమ్ము వాటాలు పంచుకోవడంలో అంతర్గత కుమ్ములాటలతో ఐదునెలల పాలనలోనే ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో మతిమరుపువ్యాధితో చంద్రబాబు సతమతమౌతూ లోకేష్‌ని ముఖ్యమంత్రిని చేసే ప్రయత్నంలో ఉన్నారా అని దుయ్యబట్టారు. అరాచకాలకు పాల్పడుతున్న క్యాడర్, క్రమశిక్షణ లేని ఎమ్మెల్యేలు మంత్రులు, నిద్రాణవస్థలోకి చేజారిన అధికారయంత్రాంగం వల్ల చంద్రబాబు కేంద్రానికి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారా అని వైసీపీ నేత(YCP Leader) రాసుకొచ్చారు.