టీడీపీలోకి తారకరత్న భార్య అలైఖ్య రెడ్డి..!

by srinivas |   ( Updated:2024-01-03 15:09:34.0  )
టీడీపీలోకి తారకరత్న భార్య అలైఖ్య రెడ్డి..!
X

దిశ, వెబ్ డెస్క్: తారకరత్న భార్య అలైఖ్య రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. బుధవారం చంద్రబాబును కలిసిన ఆమె పార్టీలో చేరే అంశంపై చెప్పినట్లు సమాచారం. చంద్రబాబు ఒకే అంటూ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సైతం ఆమె సిద్ధంగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. తారకరత్న టీడీపీలో యాక్టివ్ పొలిటిషియన్‌గా పని చేయాలని భావించారు. కానీ విధి ఆయన్ను వంచింది. టీడీపీ కార్యక్రమంలో గుండెపోటుతో మరణించారు. ఇదిలా ఉంటే తారకరత్న భార్య అలైఖ్య టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు తన కూతురు నిష్కతో కలిసి చంద్రబాబును అలైఖ్య కలిశారు. టీడీపీలో చేరతానని, తనకు అవకాశం కల్పించాలని కోరినట్లు సమాచారం. మరి అందుకు చంద్రబాబు నుంచి ఎలాంటి స్పందన వచ్చిందో తెలియాల్సి ఉంది.

కాగా అలైఖ్య కుటుంబానికి కూడా రాజకీయ నేపథ్యం ఉంది. కానీ ఆమె ఎప్పుడూ ఎలాంటి రాజకీయ కామెంట్స్ చేయలేదు. అలాంటి భార్య ఆశయాలతో అలైఖ్యరెడ్డి రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇక వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి భార్య చెల్లెలు కూతురే అలైఖ్య రెడ్డి. తారకరత్న సినిమాలు చేసే సమయంలో అలైఖ్యరెడ్డిని ఇష్టపడ్డారు. ఆ తర్వాత వివాహం చేసుకున్నారు. సినిమాలు తగ్గడంతో తెలుగుదేశం పార్టీ ద్వారా ప్రజా సేవ చేయాలని అనుకున్నారు.

Read More..

జగన్‌ను కలిసేందుకు షర్మిల వెంట వెళ్లని విజయమ్మ.. కారణం అదే..?

Advertisement

Next Story