- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎన్నికలు పూర్తి అయ్యాక టీడీపీలోకి సీఎం జగన్: వర్మ సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరబోతున్నారంటూ వస్తోన్న వార్తలపై మాజీ ఎమ్మెల్యే, పిఠాపురం టీడీపీ నియోజకవర్గ ఇంచార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. పిఠాపురం నియోజకవర్గ పరిధిలో సోమవారం ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ.. తాను వైసీపీలోకి వెళ్తున్నట్లు జరగుతోన్న ప్రచారమంతా అవాస్తవమని కొట్టిపారేశారు. పార్టీ మారుతున్నట్లు వైసీపీ నేతలు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. తాను చంద్రబాబు మనిషినని తేల్చి చెప్పారు. 2014 నుండి తనను వైసీపీలో చేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారని.. కానీ అది జరగని పని స్పష్టం చేశారు.
పిఠాపురంలో వైసీపీ ఓడిపోతుందనే భయంతోనే తాను పార్టీ మారుతున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పిఠాపురంలో వైసీపీకి ఓటమి ఖాయమని.. కూటమి అభ్యర్థి పవన్ కల్యాణ్‌ను భారీ మెజార్టీతో గెలిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలు పూర్తి అయ్యాక చంద్రబాబు, పవన్ కల్యాణ్ సమక్షంలో జగన్ టీడీపీలో చేరుతారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే అయిన వర్మ.. పవన్ కల్యాణ్ కోసం ఈ సారి తన సీటును త్యాగం చేసిన విషయం తెలిసిందే.