- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
13ఏళ్ళ మైనర్ బాలిక అనుమానాస్పద మృతి
దిశ, డైనమిక్ బ్యూరో: మచిలీపట్నం ఈడేపల్లిలో 13ఏళ్ల బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం ఒక్కసారిగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. గాంజాల పద్మ భర్త మృతి చెందాడు. ఆమెకు 13 ఏళ్ళ కుమార్తె (గంజాల జూలీ) ఉంది. రెండేళ్లుగా ఆమె ఈడేపల్లిలో కుమార్తెతో కలిసి అద్దెకు జీవిస్తుంది. ఇంటి దగ్గరలో ఓ టీ స్టాల్ పెట్టుకుని కుటుంబాన్ని నెట్టుకొస్తుంది. అయితే శుక్రవారం యధావిధిగా పద్మ టీస్టాల్‌కు వెళ్లిపోయింది.
అయితే కాగితాల నిమిత్తం ఇంటికి వరుసకు బాబాయ్ అనే వ్యక్తిని పంపింది. అతడు ఇంటికి వచ్చి తలుపు చూసే సరికి జూలీ మృతి చెంది ఉంది. ఈ విషయాన్ని తల్లిపద్మకు తెలిపాడు. అయితే జూలీ అనుమానాస్పద మృతిపై అనేక కారణాలు వినిపిస్తున్నాయి. తల్లి వివాహేతర సంబంధమే జూలీమరణానికి కారణమని పలువురు ఆరోపిస్తున్నారు. తమ వివాహేతర సంబంధానికి జూలీ ఎక్కడ అడ్డు వస్తుందనే ఉద్దేశంతో హత్య చేసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.
మరోవైపు తనకు ఎలాంటి అక్రమ సంబంధం లేదని ఎవరితోనూ సహజీవనం చేయడం లేదని పద్మ తెలిపింది. కానీ వరుసకు బాబాయ్ అవుతాడని.. అతడే తమ కుటుంబ బాగోగులను చూసుకుంటున్నాడని.. అలాంటి వ్యక్తికి తనకు అక్రమ సంబంధాలు కడుతున్నారని వాపోయింది. అంతేకాదు తన కుమార్తె మృతికి తనకు సరైన కారణం తెలియడం లేదంటున్నారు. గురువారం ఇంట్లో బీరువాలో ఉన్న డబ్బు పోయిందని, ఈ విషయాన్ని కుమార్తె జూలీని అడిగినట్లు తెలిపింది. డబ్బులు ఏమైపోయాయని ప్రశ్నించింది.
తనకు ఏమీ తెలియదని తన కూమార్తె చెప్పింది. దీంతో ఇంట్లోకి ఎవరినీ రానీయెుద్దని జాగ్రత్తగా ఉండాలని అంది. అయితే శుక్రవారం కుమార్తె జూలీకి పద్మ జడలు వేసి టిఫిన్ చేయమని డబ్బులు సైతం ఇచ్చి బయటకు వెళ్లింది. స్కూలుకు వెళ్లిపోవాలని చెప్పి తాను టీస్టాల్ వద్దకు వచ్చినట్లు పద్మ తెలిపింది. మరోవైపు బాలిక మృతదేహం వద్ద మంచం మీద సిగిరెట్ పొడి పడి ఉండటం అనేక అనుమానాలు కలిగిస్తున్నాయి. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.