- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Suspension: సీఐడీ మాజీ చీఫ్ సంజయ్ సస్పెన్షన్ వేటు.. ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్
దిశ, వెబ్‌డెస్క్: ఏపీ సీనియర్ ఐపీఎస్ అధికారి సంజయ్ (Sanjay)పై సర్కార్ సస్పెన్షన్ వేటు వేసింది. ఈ మేరకు ఆలిండియా సర్వీసెస్ (All India Services) రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం ఆయనపై చర్యలు తీసుకుంటూ సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ (CS Neerabh Kumar Prasad) ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, సంజయ్ (Sanjay) అగ్నిమాపక డీజీగా ఉండగా అగ్ని-ఎన్‌వోసీ (NOC) టెండర్ల ప్రక్రియలో అక్రమాలతో పాటు నిబంధనల అమలులో అవకతవకలకు పాల్పడినట్లుగా విజిలెన్స్ విచారణ (Vigilance Investigation)లో వెల్లడైంది.
గత ప్రభుత్వం హయాంలో అగ్ని పోర్టల్‌లో ఎన్‌వోసీ (NOC), హార్డ్‌వేర్ (Hardware) సరఫరా కోసం రూ.2.29 కోట్ల ఒప్పందాన్ని సౌత్రికా టెక్నాలజీస్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ (Sautrika Technologies and Private Limited )కు సంజయ్ కట్టబెట్టారనే అభియోగాలు కూడా ఉన్నాయి. దీంతో అఖిల భారత సర్వీసుల నియమావళిలోని 3 (1) సెక్షన్ ప్రకారం రాష్ట్ర సర్కార్ సంజయ్ (Sanjay)పై సస్పెన్షన్ వేటు వేసింది. అదేవిధంగా ఆయన అనుమతి లేకుండా విజయవాడ దాటి వెళ్లకూడదని సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ (CS Neerabh Kumar Prasad) ఉత్తర్వులు జారీ చేశారు.