Breaking: అమరావతి ఆర్-5 జోన్ విషయంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

by srinivas |   ( Updated:2023-05-15 13:02:53.0  )
Breaking: అమరావతి ఆర్-5 జోన్ విషయంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: అమరావతి ఆర్-5 జోన్ విషయంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆర్-5 జోన్‌లో స్థానికేతరులకు ఇళ్లు ఇవ్వొచ్చన్న హైకోర్టు తీర్పుపై అమరావతి రైతులు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. హైకోర్టు తీర్పును రద్దు చేయాలని కోరారు. ఈ సవాల్‌పై విచారించిన సుప్రీం ధర్మాసనం హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. ఇకపై అమరావతి కేసులతో పాటు ఆర్-5 జోన్ కేసుల విచారణను చేపట్టనుంది. దీంతో అమరావతి రైతులు పెట్టుకున్న ఆశలు సుప్రీంకోర్టు నిర్ణయంతో అడియాశలైనటైంది.

కాగా అమరావతి రాజధాని ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం ఆర్-5 జోన్‌ను ఏర్పాటు చేసింది. ఈ ప్రాంతంలో స్థానికేతరులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు సిద్ధమైంది. దీంతో స్థానిక రైతులు ఏపీ హైకోర్టుకు వెళ్లారు. రాజధాని అభివృద్ధి కోసం తమ భూములు ఇచ్చామని, ఆ ప్రాంతంలో స్థానికేతరులకు ఇళ్ల స్థలాలు ఇవ్వొద్దని పిటిషన్ దాఖలు చేశారు. అయితే రాజధాని ప్రాంతంలో ఎవరికైనా ఇళ్ల స్థలాలు ఇవ్వొచ్చని హైకోర్టు తీర్పు నిచ్చింది. దీంతో ఈ తీర్పుపై రైతులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు తీర్పును సవాల్ చేశారు. ఈ మేరకు ఇవాళ విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వడం కుదరని తేల్చి చెప్పింది.

Advertisement

Next Story

Most Viewed