- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆదుకోండి: ఏపీకి కేంద్రబృందం...మరికాసేపట్లో పర్యటన
దిశ, డైనమిక్ బ్యూరో : ఆంధప్రదేశ్‌లో మిచౌంగ్ తుఫాన్ బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ తుఫాన్ ధాటికి అన్నదాత సర్వం కోల్పోయాడు. ముఖ్యంగా ఉభయగోదావరి జిల్లాలలో పంట చేతికి అందివచ్చే సమయానికి ఈ తుఫాన్ రావడంతో పంట నీటమునిగింది. వరి చేలు నేలకొరిగాయి. వారం రోజులపాటు నీరు నిల్వ ఉండిపోవడంతో రైతులు విలపిస్తున్నారు. అయితే మిచౌంగ్ తుపాన్ ప్రభావంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిన సంగతి తెలిసిందే. అయితే ఈ మిచౌంగ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో రెండు రోజులపాటు కేంద్ర బృందం పర్యటించనుంది. ఇప్పటికే రాష్ట్రానికి చేరుకున్న ఈ బృందం బుధవారం,గురువారం రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించనుంది. ప్రభావిత జిల్లాల్లో నష్టపోయిన పంటలు, ఇతర ఆస్తులను అధికారులు అంచనా వేయనున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా బుధవారం కృష్ణా, బాపట్ల జిల్లాల్లో, గురువారం నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అధికారుల బృందం పరిశీలన చేయనుంది. పంట నష్టం అంచనావేసేందుకు వెళ్లేముందు డిజాస్టర్ మేనేజ్‌మెంట్ డైరెక్టర్‌తో భేటీకానుంది. అయితే ఈ కేంద్ర బృందాలు రెండుగా ఏర్పడి పలు ప్రాంతాల్లో పర్యటిస్తారని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ డా.బి.ఆర్ అంబేద్కర్ తెలిపారు.