Pandemic: ఆ వ్యాధి వస్తే ప్రపంచమే అల్లకల్లోలం.. ఇది ఎప్పుడైనా వెలుగులోకి రావొచ్చన్న నిపుణులు

by Prasanna |   ( Updated:2025-01-07 09:12:29.0  )
Pandemic: ఆ వ్యాధి వస్తే ప్రపంచమే అల్లకల్లోలం.. ఇది ఎప్పుడైనా వెలుగులోకి రావొచ్చన్న నిపుణులు
X

దిశ, వెబ్ డెస్క్ : కంటికి కూడా కనిపించని కరోనా వైరస్ ( Coronavirus ) ప్రపంచాన్నే గడ గడ లాడించి ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకుంది. ఇప్పుడిప్పుడే ఆ మహమ్మారి నుంచి కోలుకుంటున్న సమయంలో మరో కొత్త వైరస్ వణికిస్తుంది. 2019లో వెలుగులోకి వచ్చిన కోవిడ్ ను చాలామంది నిర్లక్ష్యం చేయడం వలన ప్రపంచం మొత్తం పాకింది. ఇప్పుడు, ఇదే సమయంలో చైనాలో కొత్త రకం వైరస్‌ వ్యాప్తి చెందుతుందంటూ ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో, మళ్లీ ప్రపంచానికి మరో మహమ్మారి ముప్పు రాబోతోందా అని ప్రజల్లో ఆందోళన మొదలైంది. ఇదిలా ఉండగా, భయంకరమైన ఆ అంటువ్యాధి ఒకసారి వస్తే ప్రపంచమే అల్లకల్లోలం అవుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

డిసీజ్‌ ‘ఎక్స్‌’ ( Disease X) అనే ఒక ఊహాజనిత వ్యాధి. ఇది ఇప్పటి వరకు అయితే వెలుగులోకి రాలేదు. కానీ, ఒక్కసారి వస్తే ప్రపంచ మొత్తం చుట్టేసే అవకాశం ఉన్న వ్యాధి కారకమని అంటున్నారు. ఇది పర్యావరణ మార్పుల వలన ఎప్పుడైనా వెలుగులోకి రావొచ్చనే ఉద్దేశంతో దీనికి ఈ పేరును నామకరణం చేశారు. అలాగే, కరోనా మనకి మిగిల్చిన చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకొని తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్య వ్యవస్థలు కూడా తప్పుడు సమాచారం వ్యాప్తి జరగకుండా చూడాలి. ఏ వ్యాధి ఎలాంటి ప్రమాదానికి దారితీస్తోందో తెలియదు. కాబట్టి, అత్యంత జాగ్రత్తగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.

Advertisement

Next Story