- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Siva Karthikeyan: నా సినిమా హిట్ అయినా నాకు క్రెడిట్స్ ఇవ్వరు.. శివకార్తికేయన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ (వీడియో)
దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్(Siva Karthikeyan) ఇటీవల ‘అమరన్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. రాజ్ కుమార్ పెరియస్వామి(Rajkumar Periasamy) దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో సాయి పల్లవి(Sai Pallavi) హీరోయిన్‌గా నటించింది. అయితే ఇది ఉన్ని ముకుందన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా రూ. 300 కోట్లుకు పైగా కలెక్షన్లు రాబట్టి బాక్సాఫీసు వద్ద రాణించింది. దీంతో శివ కార్తికేయన్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం ఆయన సుధ కొంగర దర్శకత్వంలో ‘sk-25’లో నటిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘‘ఇండస్ట్రీలోకి ఓ కామన్ మ్యాన్ వచ్చి ఎదిగితే.. కొంత మంది బాగానే వెల్కమ్ చేస్తారు.. కానీ మరికొందరు మాత్రం సహించలేరు. అంత ఎంకరేజ్ చేయరు.. వెల్కమ్ చెప్పరు. ఎవడ్రా వీడు అని అనుకుంటారు. కొంత మంది అయితే నా మొహం మీదే అన్నారు. ఎవడ్రా నువ్వు.. నీకు ఇక్కడేం పని అన్నారు. కానీ అలా అన్నా కూడా నేను వారిని చూసి నవ్వుకుని అలా సైలెంట్‌గా వెళ్లేవాడిని. నేను ఎవరికీ రిప్లై ఇవ్వదలుచుకోలేదు.
నా సక్సెస్ ఇస్తుందని కూడా నేను అనుకోలేదు. ఎందుకంటే అది అద్భుతంగా వర్క్ చేస్తు్న్న నా టీమ్‌కు, అలాగే నాకు సపోర్ట్ చేస్తున్న అభిమానులకు అంకితం. అలాగే కొందరు అన్నా నీలాగే కావాలని అనుకుంటున్నా అని ఇన్స్పైరింగ్‌గా తీసుకుంటున్న వారికి. అయితే నా సినిమా సక్సెస్ అయినా కూడా నాకు మాత్రం క్రెడిట్స్ ఇవ్వరు. మిగిలిన వారందరికీ క్రెడిట్స్ ఇస్తారు. ఫెయిల్ అయితే మాత్రమే ఓ గ్రూపుగా అందరూ నన్ను టార్గెట్ చేస్తారు. సినిమా హిట్ అయితే నన్ను సపోర్ట్ చేసి నన్ను అంగీకరిస్తారు’’ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
"In this industry, few are welcoming but few groups were not happy & said straight on my face that who are you in this industry. I just smile & move on. In SM, certain groups will attack me if film fails & gives credit to others if it becomes success" pic.twitter.com/TjolkR0dsZ
— AmuthaBharathi (@CinemaWithAB) January 6, 2025