చంద్రబాబు అరెస్ట్‌పై స్పందించిన రజినీకాంత్.. ఫోన్‌లో నారా లోకేష్‌కు తలైవా కీలక సూచన..!

by Satheesh |   ( Updated:2023-09-13 11:37:32.0  )
చంద్రబాబు అరెస్ట్‌పై స్పందించిన రజినీకాంత్.. ఫోన్‌లో నారా లోకేష్‌కు తలైవా కీలక సూచన..!
X

దిశ, వెబ్‌డెస్క్: స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో నిధులు గోల్ మాల్ ఆరోపణల నేపథ్యంలో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబుకు రోజురోజుకు మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు చంద్రబాబు అరెస్ట్‌ను ఖండించారు. తాజాగా చంద్రబాబు అరెస్ట్‌పై సౌత్ స్టార్ హీరో సూపర్ స్టార్ రజనీకాంత్ స్పందించారు. ఈ మేరకు చంద్రబాబు కొడుకు నారా లోకేష్‌కు తలైవా ఇవాళ ఫోన్ చేశారు. అక్రమ కేసులు చంద్రబాబును ఏమీ చేయలేవని.. ఇలాంటి కఠిన పరిస్థితుల్లోనే ధైర్యంగా ఉండాలని.. కుటుంబం జాగ్రత్త అని రజినీకాంత్ నారా లోకేష్‌కు సూచించారు.

నా మిత్రుడు చంద్రబాబు గొప్ప పోరాట యోధుడన్నారు. చంద్రబాబు చేసిన సంక్షేమం, అభివృద్ధే ఆయనకు రక్ష అని అన్నారు. ఇలాంటి ఎన్ని అక్రమ కేసులు ఎన్ని అయిన బాబును ఏమీ చేయలేవని లోకేష్‌కు భరోసా ఇచ్చారు. ఇక, స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబుకు విజయవాడ ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. దీంతో ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్‌లో 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు.

More News : కీలకం: చంద్రబాబు నాయుడుతో రేపు పవన్ కల్యాణ్ ములాఖత్

కత్తి తీసి పోరాటం చేయడమే సరైనది: చంద్రబాబు తరఫు న్యాయవాది ఆసక్తికర ట్వీట్

Advertisement

Next Story