ఏపీ ఎన్నికల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు.. వైరల్ అవుతున్న వీడియోలు

by Hamsa |   ( Updated:2024-05-12 19:39:14.0  )
ఏపీ ఎన్నికల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు.. వైరల్ అవుతున్న వీడియోలు
X

దిశ, సినిమా: ఎన్నికలకు ఎక్కువ సమయం లేకపోవడంతో దేశవ్యాప్తంగా ప్రచారాలు మార్మోగిపోతున్నాయి. అన్ని పార్టీల నాయకులు ప్రచారంలో పాల్గొంటూ ప్రజలకు హామీలు ఇస్తున్నారు. అయితే ఈసారి ఎన్నికల ప్రచారంలో ఎంతో మంది సినీ ఇండస్ట్రీకి చెందిన వారు కూడా విశేషం. ఇక ఎన్నికల సమయంలో సినిమా డైలాగ్స్, పాటలు నెట్టింట వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో మహేష్ బాబు నటించిన సినిమాల్లోని డైలాగ్స్ వీడియోలు నెట్టింట దుమ్మురేపుతున్నాయి.

ప్రచారంలో, ఇంటర్వ్యూల్లో నాయకులు మహేష్ బాబు డైలాగ్స్ వాడుతున్నారు. టీడీపీ అభ్యర్థిగా బరిలోకి వచ్చిన పెమ్మసాని చంద్రశేఖర్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా.. ఇందులో భాగంగా మహేష్ బాబు బిజినెస్‌మెన్ డైలాగ్‌ను రిలేటెడ్‌గా చెప్పారు. నేను ఊరికే రాలేదు. జెండా పాతడానికే వచ్చాను అంటారు’’ అని యాంకర్ అనగా.. ఆయన అవును అన్నట్లుగా నవ్వుతారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

అలాగే విశాఖపట్నం టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గీతం భరత్ ఓ టీ స్టాల్‌కు వెళ్లారు. అక్కడ డబ్బులు పే చేయగా మహేష్ బాబు వాయిస్ వస్తుంది. దీంతో ఆయన సంతోష పడిపోతాడు. అప్పుడే పక్కన ఉన్న వ్యక్తి మీరు ఆయన సినిమాలు చూస్తారా? అని అడుగుతాడు. అప్పుడు భరత్ అతడు డైలాగ్ కొడతాడు. ‘‘పూర్వం పెట్టే కాల్చేవాడిని ఇప్పుడు బాగా తగ్గించేశా’’ అంటాడు. ప్రస్తుతం ఈ రెండు వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Advertisement

Next Story