నేటి నుంచి బడులకు సెలవులు.. ఆ స్కూల్స్ విద్యార్థులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం..

by Indraja |
నేటి నుంచి బడులకు సెలవులు.. ఆ స్కూల్స్ విద్యార్థులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం..
X

దిశ వెబ్ డెస్క్: అటు విద్యార్థులతో పాటు ఇటు ఉపాధ్యాయిని ఉపధ్యాయులు కూడా ఎదురు చూసే వేసవి సెలవలు వచ్చేసాయి. నేటి నుండి రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ, ప్రయివేట్ పాఠశాలలకు వేసవి సెలవులు ఇస్తున్నట్లు రెండు రాష్ట్రాల ప్రభుత్వం ప్రకటించింది. సాధారణంగా సెలవులు అనగానే పిల్లలు ఆడుకోవచ్చని ఆనందపడుతుంటారు.

అయితే ప్రయివేట్ పాఠశాలల యాజమాన్యం మాత్రం ప్రత్యేక తరగతులు అని మొదలు పెట్టి విద్యార్థుల ఆనందాన్ని ఆవిరి చేస్తుంటాయి. అయితే ఇకపై ప్రయివేట్ పాఠశాలలు విద్యార్థులకు సెలవుల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించకూడని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సెలవులు ఇచ్చేది విద్యార్థులు సరదాగా గడుపుతారని, అలంటి సెలవుల్లో ప్రత్యేక తరగతులు తీసుకుంటే కఠిన చర్యలు తప్పవని ఉన్నతాధికారులు హెచ్చరించారు. కాగా సెలవుల సమయాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకునేలా ఏపీ విద్యాశాఖ సెలవుల్లో సరదాగా కార్యక్రమాన్ని నిర్వహించనుంది.

Advertisement

Next Story