డిప్యూటీ సీఎంకు షాక్.. పార్టీ వీడేందుకు సిద్ధమైన 300 మంది నేతలు

by srinivas |
డిప్యూటీ సీఎంకు షాక్.. పార్టీ వీడేందుకు సిద్ధమైన 300 మంది నేతలు
X

దిశ, వెబ్ డెస్క్: డిప్యూటీ సీఎం నారాయణ స్వామిపై సొంత పార్టీ నాయకుల నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పార్టీ ఇంచార్జుల మార్పు నేపథ్యంలో నారాయణ స్వామికి చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కేటాయించనున్నారని ప్రచారం జరుగుతోంది. దీంతో డిప్యూటీ సీఎంను చిత్తూరు జిల్లాలోని 6 మండలాల నాయకులు వ్యతిరేకిస్తున్నారు. నారాయణ స్వామి వద్దు.. జగనన్న ముద్దు అంటూ మాజీ ఎంపీ జ్ఞానేందర్ రెడ్డి వర్గం నేతలు ఆందోళనకు దిగారు. గంగాధర్ నెల్లూరు టికెట్‌ను నారాయణ స్వామికి ఇవ్వొద్దంటూ నినాదాలు చేశారు.డిప్యూటీ సీఎంకు ఈ సీటును కేటాయిస్తే తామంతా పార్టీ నుంచి బయటకు వెళ్లిపోతామని జ్ఞానేందర్ రెడ్డి వర్గం తేల్చి చెప్పింది.

నారాయణ స్వామికి ఈసారి గంగాధర నెల్లూరు బరిలో దిగితే కచ్చితంగా ఓడిపోతారని మాజీ జెడ్పీటీసీ గుణ శేఖర్ హెచ్చరించారు. ఇదే విషయాన్ని వారం క్రితం మంత్రి పెద్దిరెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని కలిసి చెప్పామని తెలిపారు. నారాయణ స్వామికి సీటు ఇవ్వొద్దంటూ చిత్తూరు జిల్లా పెనుమూరులో సోమవారం ఉదయం 300 మంది వైసీపీ నేతలు, ఎంపీపీ, జడ్పీటీసీలు నిరసన వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed