- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
దృఢ సంకల్పంతో అడుగులు వేయాలి: ప్రధాని నరేంద్ర మోదీ
దిశ, వెబ్‌డెస్క్: దృఢ సంకల్పంతో అడుగులు వేయాల్సిన సమయం ఆసన్నమైందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సోమవారం ఆయన స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ఎర్రకోట వద్ద జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ముందుగా మహాత్మాగాంధీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, బాబాసాహెబ్ అంబేద్కర్, వీర్ సావర్కర్, భగత్ సింగ్, జవహర్‌లాల్ నెహ్రూ వంటి స్వాతంత్య్ర సమరయోధులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ..మన స్వాతంత్య్ర పోరాట సమయంలో, బ్రిటీష్ వారి క్రూరత్వాన్ని ఎదుర్కొని స్వాతంత్ర్య సమరయోధులు ధైర్యంగా నిలబడి పోరాడారని తెలిపారు, నేడు మనం వారికి నివాళులు అర్పిస్తూ, భారతదేశం కోసం వారు కలలను గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని మోదీ అన్నారు. కొత్త సంకల్పంతో కొత్త దిశలో అడుగు పెట్టాల్సిన రోజని, జవహర్‌లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ వంటి అనేక మంది దేశానికి ఎంతో సేవా చేశారని కొనియాడారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా.. ఈ ఏడాది ఆగస్టు 15న స్వాతంత్ర్య వేడుకలు ప్రత్యేకించి ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ప్రధానమంత్రి 2014 నుండి స్వాతంత్ర్య దినోత్సవం గణతంత్ర దినోత్సవంలో రంగురంగుల తలపాగాను ధరిస్తున్నారు..ఈ సారి కూడా అయన అలాగే ఎరుపు రంగులతో కూడిన తలపాగా, పొడవైన గులాబీ ట్రయిల్‌ను ధరించారు.
అవినీతి, బంధుప్రీతి ఈ రెండు భారత్‌కు పెద్ద సవాళ్లు: ప్రధాని మోడీ