- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రేమోన్మాది కల్యాణ్ పశువులా ప్రవర్తించాడు : Vasireddy Padma
దిశ, డైనమిక్ బ్యూరో : పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ప్రేమోన్మాది చేతిలో గాయపడ్డ బాధితులను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ పరామర్శించారు. ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్సపొందుతున్న బాధితురాలతోపాటు తల్లి, ఆమె సోదరిని వాసిరెడ్డి పద్మ పరామర్శించి ధైర్యం చెప్పారు. వారికి అందుతున్న చికిత్సపై ఆరా తీశారు. అనంతరం జరిగిన ఘోరంపై అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రేమోన్మాదిని కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం వాసిరెడ్డి పద్మ ఆస్పత్రి వద్ద మీడియాతో మాట్లాడారు. ఈ ఘటన చాలా దురదృష్టకరమన్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. నిందితుడు కల్యాణ్‌ను కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు.
కల్యాణ్ ఒక పశువులా అర్ధరాత్రి ప్రవర్తించాడని మండిపడ్డారు. బాధిత యువతి డిగ్రీ పూర్తి చేసి కంప్యూటర్ కోర్స్ చేస్తోందని... అయితే పవర్ కట్ చేసి మరీ దాడికి పాల్పడ్డాడని తమ విచారణలో తేలిందన్నారు. కరెంట్ పోవడంతో ఇంటిలోని వారు బయటకు రావడంతో ఆ సమయంలో యువతితో పాటు తల్లి, చెల్లి చేతులు, మెడపైన కత్తితో దాడి చేశాడని చెప్పుకొచ్చారు. బాధితుల వైద్యానికి అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు. ప్రేమోన్మాదిపై చార్జ్‌షీట్ త్వరగా వేయాలని.. రౌడీ షీట్ తెరవాలని ఎస్పీని ఆదేశించినట్లు మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ వెల్లడించారు.