Srisailam: శ్రీశైల క్షేత్రానికి పోటెత్తిన భక్తులు.. ఆర్జిత సేవలు నిలిపివేత

by Shiva |
Srisailam: శ్రీశైల క్షేత్రానికి పోటెత్తిన భక్తులు.. ఆర్జిత సేవలు నిలిపివేత
X

దిశ, వెబ్‌డెస్క్: అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన శ్రీశైలం (Srisailam) శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయంలో కార్తీక మాస (Karthika Masam) ఉత్సవాలు అట్టహాసంగా ప్రారంభం అయ్యాయి. ఈ మేరకు ఉత్సవాలు డిసెంబర్ 1 వరకు కొనసాగుతాయని ఈవో చంద్రశేఖర్ రెడ్డి (EO Chandrashekar Reddy) తెలిపారు. భక్తుల రద్దీ కారణంగా శని, ఆదివారాల్లో స్పర్శ దర్శనాన్ని (Sparsha Darshan) రద్దు చేశారు. అదేవిధంగా మంగళవారం నుంచి శుక్రవారం వరకు స్పర్శ దర్శనం, సామూహిక అభిషేక సేవలు అందుబాటులో ఉంటాయి.

ఇవాళ కార్తీక మాసం (Karthika Masam) మొదటి సోమవారం కావడంతో స్వామి వారిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల (Telugu States)తో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరాది రాష్ట్రాల నుంచి భక్తులు పోటెత్తారు. దీంతో ఆలయంలో నిత్యం జరిగే ఆర్జిత సేవలను పూర్తిగా నిలిపివేశారు. ముందుగా భక్తులు పాతాళగంగలో కార్తీక స్నానాలు ఆచరించి స్వామి దర్శనానికి వెళ్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రధాన ఆలయంలో తెల్లవారుజామున 5 గంటల నుంచి 9 గంటల వరకు స్వామి వారి దర్శనానికి అనుమతిస్తున్నారు. ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా బారికేడ్లు, భారీ ఎత్తున పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు.

Advertisement

Next Story

Most Viewed