- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
చంద్రబాబు, పవన్ మాయగాళ్లు: డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు
దిశ, ఏపీ బ్యూరో: పేదల సంక్షేమం కోసం ఆవిర్భవించిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఉప ముఖ్యమంత్రులు బూడి ముత్యాల నాయుడు, రాజన్నదొరలు అన్నారు. వైసీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం, పార్వతీపురం, కృష్ణా జిల్లా మచిలీపట్నం నియోజకవర్గాల్లో జరిగింది. ఉత్తరాంధ్ర జిల్లాలోని ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు పుష్ప శ్రీవాణి, అలజంగి జోగారావుల ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభలో ఉప ముఖ్యమంత్రులు మాట్లాడారు. రాష్ట్రంలో ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు, ఆనందం చూడాలనే ఆలోచనలతో పుట్టిందే వైసీపీ పార్టీ అన్నారు. గత ఎన్నికల సమయంలో అనేక హామీలిచ్చి అధికారంలోకొచ్చిన తర్వాత చంద్రబాబు ప్రజలను మోసం చేశారని, జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత డ్వాక్రా మహిళలకు, రైతులకు రుణాలు మాఫీ చేయడంతో పాటు స్కూల్ పిల్లల తల్లులకు అమ్మఒడి పేరుతో డబ్బును ఖాతాలో జమ చేశారని గుర్తు చేశారు. వెనుకబడిన గిరిజన ప్రాంతాల అభివృద్ధికి జగన్ ముందు నుంచి కట్టుబడి ఉన్నారని, రాష్ట్రంలో సుమారు 8 కోట్ల మంది జనాభా ఉంటే సుమారు 45 లక్షల జనాభా కలిగిన గిరిజనులకు గుర్తింపును ఇస్తూ ప్రత్యేకంగా పార్వతీపురం మన్యం జిల్లాను ఏర్పాటు చేశారన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పొత్తులతో మాయగాళ్లు వస్తున్నారని, గత మోసాలు గుర్తు చేసుకుని ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని సూచించారు.
గిరిజనుల అభివృద్ధికి సీఎం కృషి : కురుపాం ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి
గిరిజనుల అభివృద్ధికి సీఎం జగన్ ఎంతో కృషి చేశారని కురుపాం ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి అన్నారు. గిరిజన ప్రాంతంలో మెడికల్ కాలేజీ, ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి ఆధునిక సాంకేతిక విద్యను గిరిజనులకు అందుబాటులోకి తీసుకొచ్చిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందన్నారు. గిరిజన వర్గానికి చెందిన తనను రాష్ట్రానికి తొలి మహిళా ఉప ముఖ్యమంత్రిని చేసిన సీఎం జగన్ తన ఆలోచనలు ఏంటో చాటి చెప్పారన్నారు. వచ్చే ఎన్నికల్లో ఈ తూర్పు కనుమల్లో వైసీపీ జెండా ఎగురవేయడం ఖాయమని పునరుద్ఘాటించారు.