Srikakulam: పుట్టెడు దు:ఖంలోనూ భార్య అవయవాలను దానం చేసిన భర్త

by srinivas |   ( Updated:2023-06-02 10:56:11.0  )
Srikakulam: పుట్టెడు దు:ఖంలోనూ భార్య అవయవాలను దానం చేసిన భర్త
X

దిశ, డైనమిక్ బ్యూరో: బ్రెయిన్ డెడ్ అయిన మహిళ అవయవాలను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు ముందుకు వచ్చారు. శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలంలోని మధుపాం గ్రామానికి చెందిన పట్నాన శివ భార్య చంద్రకళ(34)అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆమె విశాఖపట్నంలో విమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే గురువారం సాయంత్రం చంద్రకళ బ్రెయిన్ డెడ్ అయ్యింది. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు వైద్యులు తెలియజేశారు. ఈ మేరకు చంద్రకళ భర్త శివ, కటుంబ సభ్యులు అవయదానం చేసేందుకు ముందుకు వచ్చారు.

దీంతో వైద్యులు శుక్రవారం ఉదయం చంద్రకళ శరీరంలోని కళ్లు, కిడ్నీలు, ఊపిరితిత్తులు, కాలేయం, గుండెను శస్త్ర చికిత్స చేసి బయటకు తీశారు. అనంతరం కళ్లను వైజాగ్‌ ఎల్‌‌వి ప్రసాద్ ఆస్పత్రికి, కిడ్నీలు వైజాగ్‌ ప్రైవేట్‌ ఆస్పత్రికి, మిగిలిన అవయవాలను అవయవదాన్‌ సంస్థకు అప్పగించారు. అనంతరం మృతదేహాన్ని జి.సిగడాం తరలించారు.

Advertisement

Next Story