Breaking: టపాసుల్లా పేలుతున్న బైక్‌లు

by srinivas |   ( Updated:2023-04-19 13:15:49.0  )
Breaking: టపాసుల్లా పేలుతున్న బైక్‌లు
X

దిశ, ఉత్తరాంధ్ర: శ్రీకాకుళం కాసీబుగ్గలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ బైక్ షోరూంలో ఎలక్ట్రిక్ బైకులకు చార్జ్ చేస్తుండగా ప్రమాదం జరిగింది. మంటల్లో 90 బైకులు దగ్ధం అయినట్లుగా ప్రాథమిక సమాచారం అందింది. ఓవైపు టపాసుల్లా.. బైకులు పేలుతు ఉండడంతో మరోవైపు మంటలు ఎగసి పడుతున్నాయి. ఈ ప్రమాదంతో ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసిన యాజమాన్లు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. అయితే పక్కనే ఉన్న హార్డ్ వేర్ దుకాణానికి కూడా మంటలు వ్యాపించినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలంలో మంటలార్పుతున్నారు.

Advertisement

Next Story