- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Dharmana Krishnadas: కుల రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు
దిశ, డైనమిక్ బ్యూరో: ఎమ్మెల్సీ ఎన్నికల్లో కుల రాజకీయాలు చేసేందుకు టీడీపీ యత్నిస్తుందని ఆ ట్రాప్‌లో పడొద్దని మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు. కవిటి మండలం బల్లి పుట్టుగలో జెడ్పీ చైర్ పర్సన్ పిరియా విజయ సాయిరాజ్ నివాసం వద్ద జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ప్రధానమైన కాపు, కాళింగ, వెలమ సామాజిక వర్గాలకు రెండు చొప్పున శాసనసభ్యుల పదవులున్నాయని చెప్పారు. అయితే జిల్లాలో మరో ప్రధానమైన యాదవ సామాజిక వర్గానికి సముచితమైన పదవిని ఇవ్వాలనే యోచనలో భాగంగా సీఎం జగన్ స్థానిక సంస్థల కోటాలో నర్తు రామారావుని శాసనమండలికి ఎంపిక చేశారని స్పష్టం చేశారు.
అయితే కొంతమంది టీడీపీ నాయకుల అండతో కాపుల ప్రతినిధులమని కొందరు కుల రాజకీయాలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని వాటిని పట్టించుకోవద్దన్నారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గానికి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీతంరాజు సుధాకర్‌ను గెలిపించాలని మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు.