Breaking: దారుణం.. వీధి కుక్కల దాడిలో మరో చిన్నారి బలి

by srinivas |   ( Updated:2023-04-21 15:24:35.0  )
Breaking: దారుణం.. వీధి కుక్కల దాడిలో మరో చిన్నారి బలి
X

దిశ, వెబ్ డెస్క్: వీధి కుక్కలు మరో చిన్నారిని బలి తీసుకున్నాయి. ఇటీవల కాలంలో చాలా చోట్ల కుక్కల స్వైర విహారం చేస్తున్నాయి. చిన్న పిల్లలపై దాడి చేసి చంపేస్తున్నాయి. ఈ ఘటనలు మరువకముందే మరో ఘటన భయాందోళనకు గురి చేస్తోంది.

శ్రీకాకుళం జిల్లా మెట్టవలస గ్రామంలో వీధి కుక్కలు స్వైర విహారం చేశాయి. ఇంటి ముందు ఆడుకుంటున్న ఏడాది చిన్నారి సాత్వికపై దాడి చేశాయి. మెడ, తల, ముఖ్యంపై విచక్షణా రహితంగా కరిచాయి. దీంతో సాత్వికకు తీవ్ర గాయాలయ్యాయి. చిన్నారిని వెంటనే రాజాం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే వైద్యులు సాత్వికను బతికించలేకపోయారు. ఈ ఘటనతో చిన్నారి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నా ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టకపోవడంపై ప్రజలు, ప్రతిపక్ష పార్టీ నాయలకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్నారుల ప్రాణం పోతున్నా మొద్ద నిద్ర పోవడాన్ని తప్పుబడుతున్నారు.

Advertisement

Next Story