Chandrayaan-3: చంద్రయాన్-3 మరో ఘనత

by srinivas |   ( Updated:2023-08-18 12:47:44.0  )
Chandrayaan-3: చంద్రయాన్-3 మరో ఘనత
X

బెంగళూరు: "చంద్రయాన్-3" మిషన్ సక్సెస్ ఫుల్‌గా ముందుకు సాగుతోంది. చంద్రుడి కక్ష్యలో సొంతంగా పరిభ్రమిస్తున్న ల్యాండర్‌ "విక్రమ్‌" తన కెమెరాతో చంద్రుడి ఉపరితలం ఫొటోలను తీసి పంపింది. ఈ ఫొటోలను ట్విట్టర్ వేదికగా ఇస్రో షేర్‌ చేసింది. చంద్రయాన్‌-3 స్పేస్ క్రాఫ్ట్‌లోని ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ నుంచి గురువారం రోజు విడిపోయిన ల్యాండర్‌.. కొద్దిసేపటికే ఈ ఫొటోలను తీసిందని ఇస్రో వెల్లడించింది.

చంద్రుడి ఉపరితలంపై ఉన్న భారీ గుంతలు (బిలాలు) "విక్రమ్‌" పంపిన ఫొటోల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ బిలాల పేర్లు ఫ్యాబ్రీ, గియార్డనో బ్రునో, హర్కేబి జే అని ఇస్రో తెలిపింది. గియార్డనో బ్రునో అనేది ఇటీవలే చంద్రుడిపై గుర్తించిన అతిపెద్ద బిలాల్లో ఒకటని పేర్కొంది. హర్కేబి జే బిలం వ్యాసం దాదాపు 43 కి.మీలు ఉంటుందని వివరించింది. అన్నీ అనుకూలిస్తే ఆగస్టు 23న సాయంత్రం చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండర్‌ "విక్రమ్‌" కాలుమోపనుంది.

Advertisement

Next Story