- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ ఆలయానికి వెళ్తే రెండు పదవులు వచ్చాయి: Ram Kumar Reddy
దిశ, డైనమిక్ బ్యూరో: మాజీమంత్రి, వైసీపీ అసంతృప్తనేత ఆనం రామనారాయణరెడ్డిపై వెంకటగిరి వైసీపీ ఇన్‌చార్జి నేదురుమిల్లి రామ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పెంచలకోన ఆలయానికి వెళితే తనను అవమానించాలని ఎమ్మెల్యే ఆనం చూశారని గుర్తు చేశారు. అయినప్పటికీ రెండుసార్లు పెంచలకొనకు వెళ్ళానని, అందుకే దేవుడు తనకు రెండు పదవులు ఇచ్చారని చెప్పారు. రాపూరు మండలంలో ఇప్పటి వరకూ పెత్తనం చెలాయించిన చెన్ను కుటుంబాన్ని తాను దగ్గరకు తీయనని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేగా గెలిచిన ఆనం రాపూరు మండలంలో చెన్ను కుటుంబానికి మాత్రమే పదవులు ఇచ్చారని తెలిపారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక మంత్రి పదవి రాలేదన్న అక్కసుతో పార్టీని వీడుతున్నారని తెలిపారు. జగన్‌ను తిట్టినా దయతలచి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారని, అయినా కృతజ్ఞతాలు లేకుండా టీడీపీ నేతలతో టచ్‌లోకి వెళ్లారని మండిపడ్డారు. టీడీపీ వాళ్ళతో టచ్‌లో ఉంటూ ప్రభుత్వంపై ఆనం విమర్శలు చేశారని రామ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. అటు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎపిసోడ్ నడుస్తుండగానే మరోవైపు ఆనం రామనారాయణరెడ్డి ఎపిసోడ్ కూడా కంటిన్యూ అవుతుండటంతో నెల్లూరు వైసీపీలో రాజకీయం రక్తికట్టిస్తోంది.