Nellore: హాస్టల్‌లోనే దారుణం.. నిందితుడి అరెస్ట్

by srinivas |   ( Updated:2023-04-15 12:26:19.0  )
Nellore: హాస్టల్‌లోనే దారుణం.. నిందితుడి అరెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: నెల్లూరు జిల్లా బీటెక్ విద్యార్థిని మృతి కేసును పోలీసులు ఛేదించారు. ఇంజినీరింగ్ కాలేజీ ఛైర్మన్ డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు. ప్రేమ పేరుతో విద్యార్థినిని డ్రైవర్ గర్భవతిని చేసినట్లు గుర్తించారు. హాస్టల్‌లోనే ఆర్ఎంపీ సహాయంతో విద్యార్థినికి అబార్షన్ చేయించారు. అబార్షన్ వికటించి విద్యార్థిని మృతి చెందినట్లు నిర్ధారించారు. విషయం బయటకు రాకుండా తల్లిదండ్రులతో నిందితుడు ఒప్పందం చేసుకున్నాడని పోలీసులు తెలిపారు.


నెల్లూరు జిల్లా మర్రిపాడుకు చెందిన విద్యార్థినిని రూరల్ పరిధిలోని ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ సెకండియర్ చదువుతున్నారు. ఈ నెల 9న హాస్టల్ నుంచి అందరూ క్లాసులకు వెళ్లారు. అయితే ఈ విద్యార్థిని మాత్రం వెళ్లలేదు. హాస్టల్ గదిలో నుంచి గడి పెట్టి ఉంది. ఎంతకీ విద్యార్థిని బయటకు రాలేదు. దీంతో తలుపులు పగులగొట్టి చూడగా విద్యార్థిని రక్త స్రావంతో పడి ఉంది. పక్కనే 6 నెలల పిండం ఉంది. దీంతో విద్యార్థినితో పాటు పిండాన్ని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే విద్యార్థిని మృతి చెందారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.

Advertisement

Next Story