'ముందు వాళ్లు.. ఆ తర్వాతే నేను'.. Ycpని డిఫెన్స్‌లోకి నెట్టిన కోటంరెడ్డి

by srinivas |   ( Updated:2023-02-10 11:15:20.0  )
ముందు వాళ్లు.. ఆ తర్వాతే నేను..  Ycpని డిఫెన్స్‌లోకి నెట్టిన కోటంరెడ్డి
X

దిశ, నెల్లూరు: టీడీపీ గుర్తు మీద గెలిచి వైసీపీలో చేరిన ఐదుగురు ఎమ్మెల్యేలతో స్పీకర్ ఫార్మెట్‌లో రాజీనామా చేయించిన తర్వాతే తనను రాజీనామా చేయాలని అడగాలంటూ మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్‌కు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఒక పార్టీ గుర్తులో గెలిచి వైసీపీలో కొనసాగుతున్న వాళ్లతో రాజీనామా చేయించి ఎన్నికల్లో గెలిచి అప్పుడు తన రాజీనామా కోరాలని సూచించారు. మీరు చేస్తే పవిత్రం. నేను చేస్తే అపవిత్రమా? అంటూ ధ్వజమెత్తారు.

నెల్లూరు రూరల్ కార్యాలయంలో శుక్రవారం కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.'నేను ఎవరి ట్రాప్‌లో పడలేదు.. పడను కూడా. ప్రజల ట్రాప్‌లో ఉంటాను. నా ఒక్కడి కోసం చంద్రబాబు ట్రాప్ వేయాల్సిన అవసరం లేదు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేయను. టీడీపీ నుంచి పోటీ చేయాలని ఉంది. అయితే ఫైనల్ నిర్ణయం మాత్రం చంద్రబాబు నాయుడిదే. జూన్ తరువాత గడపగడపకి కార్యక్రమాన్ని పునఃప్రారంభిస్తాను' అంటూ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెల్లడించారు. మరోవైపు తన వెంట నిలిచిన మేయర్, కార్పొరేటర్లు, కీలక నేతలకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని అయినప్పటికీ వారిని కాపాడుకుంటానని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. కార్యకర్తల విలువ ఏంటో తనకు తెలుసునని, తాను కూడా వాల్ పోస్టర్లు అంటించి రాజకీయాల్లో ఈ స్థాయికి ఎదిగానని చెప్పుకొచ్చారు. కష్టకాలంలో అధికార పార్టీని కాదని, తన వెంట నిలిచిన ప్రతీ ఒక్కరికీ భవిష్యత్‌లో అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఇకపోతే కార్పొరేషన్‌లో ఎప్పుడు సమావేశాలు జరిగినా... పిలిచినా, పిలవకపోయిన తాను, మేయర్ వెళ్తామని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పష్టం చేశారు.

Advertisement

Next Story