- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Nelloreలో తారాస్థాయికి జనసైనికుల మధ్య వర్గపోరు
దిశ, నెల్లూరు: ఎన్నికల సమయం సమీపిస్తున్న నేపథ్యంలో నెల్లూరు రాజకీయం రసవత్తరంగా మారింది. జనసైనికుల మధ్య వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఇద్దరు నేతలు టిక్కెట్ తనదంటే తనదేనంటూ ప్రచారాలు చేసుకోవడం మొదలుపెట్టారు. అంతేకాదు ఎవరికి వారే కార్యక్రమాలను నిర్వహించుకుంటున్నారు. తామే జనసేన పార్టీ అభ్యర్థినని చెప్పుకుంటూ సిటీలోనే ఇద్దరు నేతలు వేరు వేరుగా వెళ్లి ఓట్లడగడంతో ఓటర్లు కూడా అయోమయంలో ఉన్నారు. పార్టీ పదవులు లేక పోయినా సిటీలోని ప్రతి గడపగడపకు వెళ్తు ప్రజలకు దగ్గరవుతున్నారు.
మనుక్రాంత్‌పై గుర్రుగా ఉన్న నేతలు
జిల్లా అధ్యక్షుడిగా నియోజకవర్గ నేతలను సమన్వయపరచడంలో మనుక్రాంత్ రెడ్డి పూర్తిగా విఫలమైయ్యారని ఆ పార్టీ నేతలే చెప్పుకుంటున్నారు. నియోజకవర్గాలకు సంబంధించిన ఇంచార్జులతో అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని చర్చలు జోరుగా సాగుతున్నాయి. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ ఓటమి తరువాత మూడున్నారేళ్ల పాటు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ మనుక్రాంత్ రెడ్డి వ్యాపారాలను చక్కదిద్దుకున్నారని తెలిపారు. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్నప్పుడు పార్టీకి దగ్గరవుతూ తానే ఎమ్మెల్యే అభ్యర్థినంటూ చెప్పుకోవడంతో పార్టీలోని కొందరి నేతలకు మింగుడుపడటం లేదు. ఈ నేపథ్యంలో మనుక్రాంత్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేసినా సిటీ నేతల నుంచి సహాయం లభించదన్న ఉహాగానాలు వ్యక్తమవుతున్నాయి. సిటీ నుంచి తానే పోటీ చేయబోతున్నానని అధిస్టానం కూడా ఖరారు చేసిందని గతంలో మీడియా సమక్షంలో మనుక్రాంత్ రెడ్డి ప్రటకటించుకున్నారు.
కిషోర్ దూరం కావడం మనుక్రాంత్‌కు మైనస్
జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ గతంలో పార్టీ సభ్యత్వ నమోదులో కీలక పాత్ర పోషించారు. యువతను ఆకర్షిస్తూ నెల్లూరులో పార్టీ బలోపేతానికి తీవ్రంగా కృషి చేశారు. సిటీ రూరల్ నియోజకవర్గాలను సమన్వయం చేసుకుంటూ పార్టీని చక్కదిద్దారు. నిత్యం జిల్లా కార్యాలయంలో ఉంటూ మనుక్రాంత్ రెడ్డికి కిషోర్ సహాయంగా ఉండే వారు. అయితే వారిద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. దీంతో మనుక్రాంత్ రెడ్డిని విభేదించి కిషోర్ దూరంగా ఉంటున్నారు. తాను సొంతంగా పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుని విడిగా పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఒక్క సిటీలోనే నేతలు విడివిడిగా పార్టీ కార్యక్రమాలను నిర్వహించుకుంటున్నారు. ఇలా సిటీ విషయంతో జనసేన చీలిపోయింది.
టీడీపీ జనసేన కలయికతో వార్‌వన్ సైడ్
టీడీపీ, జనసేన కలిసి పోటీ చేయబోతున్నాయని చర్చలు జోరుగా సాగుతున్నాయి. జనసేన, టీడీపీతో కలిసినా కలవక పోయినా సిటీ నుంచి మాత్రం మాజీ మంత్రి నారాయణ పోటీ ఖాయంగా కనిపిస్తుంది. ఆయన టీడీపీ టికెట్‌పై ఒంటరిగా పోటీనా గెలుపు అవకాశం ఉంది. అదే టీడీపీ, జనసేన కలయికతో నారాయణ పోటీ చేస్తే వార్‌వన్ సైట్‌గా మారుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. నారాయణ బరిలో ఉంటే జనసేన మాత్రం ఆయనకు సపోర్టు చేయడంతో సరిపెట్టుకోవాల్సి ఉంటుంది. టీడీపీలో పొత్తులో మనుక్రాంత్ రెడ్డికి, వినోద్ రెడ్డికి పార్టీ టికెట్ కేటాయించకపోవచ్చని గుసగుసలు ఉన్నాయి.