- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీడీపీలో ఉన్నందుకు గర్వంగా ఉంది: అబ్దుల్ అజీజ్
దిశ, నెల్లూరు: ఎన్టీఆర్ మహానాయకుడి విగ్రహాన్ని ఆవిష్కరించడం అదృష్టంగా ఉందని టీడీపీ పార్లమెంట్ అధ్యక్షుడు అబ్థుల్ అజీజ్ పేర్కొన్నారు. ఎన్టీఆర్ ప్రజలకు ఒక తండ్రిలా, సోదరుడిలా భావించి ఆలోచనలు చేసేవారని ఆయన కొనియాడారు. ఉదయగిరి నియోజకవర్గం కొండాపురం మండలం సాయిపేట గ్రామంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అజీజ్, మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావులు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ మహానాయకుడు, ఆంధ్ర రాష్ట్రానికి కీర్తి తెచ్చి పెట్టిన మహానుభావుడి విగ్రహ ఆవిష్కరణకు రావడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. నందమూరి తారకరామారావు వ్యక్తి కాదని ఒక శక్తి అని కొనియాడారు. యావత్ తెలుగు ప్రజల కోసం ఆయన రాజకీయాల్లో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చారని గుర్తుచేశారు. కూడు, గుడ్డ, నీడ అనే నినాదంతో పేదవారికి ఎంతో మేలు చేశారని, ఆడబిడ్డలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించారని అబ్దుల్ అజీజ్ తెలిపారు.
ఇవి కూడా చదవండి: