- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Nellore: బైక్‌ను ఢీకొట్టిన కారు.. తండ్రీ, కుమార్తె దుర్మరణం
దిశ, డైనమిక్ బ్యూరో: నెల్లూరు జిల్లా రాపూరు మండలం వెలుగోను జంక్షన్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు-బైకు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో తండ్రీకుమార్తె మృతి చెందగా కొడుకు తీవ్ర గాయాలపాలయ్యారు. గుండవోలుకు చెందిన గంగోడి ప్రతాప్ కుమార్తె వైష్ణవి, కుమారుడు సిద్ధార్థలతో కలిసి బైక్‌పై రాపూరు వెళ్తున్నారు. అయితే వెలుగోను జంక్షన్ వద్ద పెంచలకొన నుంచి రాపూరు వైపు వస్తున్న కారు టైరు పగిలింది. దీంతో బైక్‌ను ఆ కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో గంగోడి ప్రతాప్, కుమార్తె వైష్ణవి అక్కడికక్కడే మృతి చెందారు. కుమారుడు సిద్ధార్థ తీవ్ర గాయాలపాలయ్యాడు. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న రాపూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. రాపూరు ఎస్ఐ క్రాంతికుమార్ ప్రమాదం జరిగిన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తీవ్రగాయాలు అయిన సిద్ధార్థను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.