ట్రాన్స్‌జెండర్ హత్య కేసు: 15 మంది ప్రమేయం,12 మంది అరెస్ట్

by srinivas |
ట్రాన్స్‌జెండర్ హత్య కేసు: 15 మంది ప్రమేయం,12 మంది అరెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: ట్రాన్స్‌జెండర్ సుహాసిని హత్య నెల్లూరు జిల్లాలో కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసును పోలీసులు నాలుగు రోజుల్లోనే ఛేదించారు. ఈ హత్యకు ఇద్దరు ట్రాన్స్‌జెండర్ల మధ్య విభేదాలు కారణమని తెలిపారు. ట్రాన్స్ జెండర్లు హాసిని, అలేజ్య మధ్య ఎప్పటినుంచో ఆదిపత్య పోరు జరుగుతోందని, వీరిపై తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో కేసులు ఉన్నాయని వెల్లడించారు.


మృతి చెందిన హాసినికి సులోచన, షీలా అనే ట్రాన్స్ జెండర్లతోనూ విభేదాలు ఉన్నాయని చెప్పారు. ఈ నెల 26న హాసినిని మరికొందరి సహాయంతో సులోచన షీలా హత్య చేయించారని, అనంతరం మృతదేహాన్ని నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం టపాతోపు రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద పడేశారని పోలీసులు పేర్కొన్నారు. హత్య చేసిన వాళ్లంతా నెల్లూరు జిల్లా వాసులేనన్నారు. ఈ కేసులో మొత్తం 15 మంది ప్రమేయం ఉందని, 12 మందిని అరెస్ట్ చేశామని వెల్లడించారు. మరో ముగ్గురిని సైతం త్వరలో పట్టుకుంటామని తెలిపారు.

Advertisement

Next Story