- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Nellore Rural లో పోటీకి ఎంపీ ఆదాల సై.. కోటంరెడ్డికి సవాల్
దిశ, డైనమిక్ బ్యూరో: 2024 ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా వైసీపీ నుంచి పోటీ చేస్తానని ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి ప్రకటించారు. దమ్ముంటే తనపై ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పోటీ చేయాలని సవాల్ విసిరారు. ఎంపీ ఆదాల తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రెస్ మీట్లు పెట్టి పచ్చి అబద్దాలు మాట్లాడటం చాలా తప్పు అని మండిపడ్డారు. మూడున్నరేళ్లుగా కోటంరెడ్డి సోదరులు అరాచకం సృష్టించారని.. డబ్బు పిచ్చి ఎక్కువైందని విమర్శించారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చరిత్ర త్వరలో ప్రజల దగ్గర గుట్టు విప్పుతామని హెచ్చరించారు.
వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తానని అందులో సందేహమే లేదని ఎంపీ ఆదాల పేర్కొన్నారు. ఎంపీగా పోటీ చేస్తే గత ఎన్నికల్లో ఎమ్మెల్యే కంటే 5 వేల ఓట్లు రూరల్‌లో ఎక్కువగా వచ్చాయని గుర్తు చేశారు. రియల్ ఎస్టేట్, హోటల్స్, వ్యాపారస్థులు నిన్నటి వరకు హడలిపోయారని ఇకపై అలా జరగదని చెప్పారు. కాంట్రాక్టర్‌గా వచ్చాను కాబట్టే ప్రజా సేవ చేస్తున్నా..పోరాటాల్లో నుంచి వచ్చానని శ్రీధర్ రెడ్డి ప్రజలను వేధిస్తున్నాడని ఎంపీ ఆదాల ఆరోపించారు.
మరోవైపు నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి స్థానిక కార్పొరేటర్లతో వివిధ అభివృద్ధి పనులకు సంబంధించిన సమీక్షా సమావేశం నిర్వహించారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి పనులను వేగవంతం చేసి, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.
అయితే ఈ సమావేశానికి మేయర్ స్రవంతి లేకపోవడం గమనార్హం. మేయర్ స్రవంతి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వర్గంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆమె సమావేశానికి గైర్హాజరయ్యారని తెలుస్తోంది
ఇవి కూడా చదవండి:
Ap News: టీడీపీలోకి వైసీపీ ఎంపీ.. ఆ మహిళా మంత్రే పంపిస్తున్నారా..?