యువగళం పాదయాత్రను విజయవంతం చేస్తాం.. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

by Javid Pasha |
యువగళం పాదయాత్రను విజయవంతం చేస్తాం.. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
X

దిశ, డైనమిక్ బ్యూరో : నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నారా లోకేశ్ యువగళం పాదయాత్ర నభూతో నభవిష్యత్ అన్న రీతిలో రాష్ట్రంలో మరెక్కడా జరగని రీతిలో జరిపిస్తాం అని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. లోకేశ్ యువగళం పాదయాత్రకు సంబంధించి ఎమ్మెల్యే తన కార్యాలయంలో 13 డివిజన్లకు సంబంధించిన నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. యువగళం పాదయాత్రను విజయవంతం చేసే అంశంపై చర్చించారు. రూరల్ నియోజకవర్గంలో ప్రతిఒక్కరు కష్టపడి నాది ఈ పాదయాత్ర అని నారా లోకేశ్ యువగళం పాదయాత్ర విజయవంతం చేయాలి అని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పిలుపునిచ్చారు.

జూలై 2న మధ్యాహ్నం 2 గంటలకు కాకుపల్లి వద్ద యువగళం పాదయాత్ర రూరల్ నియోజకవర్గంలోకి ప్రవేశిస్తుందని ఆ సందర్భంలో లోకేశ్‌కు ఘన స్వాగతం పలకాలని నేతలు నిర్ణయించారు.ఈ సమావేశంలో టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణ రెడ్డి, జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, కిలారి వెంకట స్వామి నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story