చంద్రబాబు, లోకేష్‌కు దళితులంటే చులకన: మంత్రి కాకాణి

by srinivas |   ( Updated:2023-04-15 16:19:55.0  )
చంద్రబాబు, లోకేష్‌కు దళితులంటే చులకన: మంత్రి కాకాణి
X

దిశ, నెల్లూరు: టీడీపీ అధినేత చంద్రబాబు, ప్రధాన కార్యదర్శి లోకేష్‌కి దళితులు అంటే చులకన అని మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి పబ్లిసిటీ స్టంట్ కోసమే ఉద్యమాలు, నిరసనలు అంటూ నానాయాగి చేస్తున్నారని ఆయన విమర్శించారు. నెల్లూరు జిల్లా వైసీపీ జిల్లా కార్యాలయంలో జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం విజయవంతంపై మంత్రి మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 62 లక్షల 24 వేల కుటుంబాలకు ‘జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం’ ద్వారా దగ్గరయ్యామని తెలిపారు. గ్రామ, మండల, జిల్లా స్థాయిల వారీగా ఈ కార్యక్రమాన్ని విజవంతంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో 7 లక్షల మంది కార్యకర్తలతో 1 కోటి 60 లక్షల ఇళ్లు తిరగడం జరిగిందన్నారు.. ఏ రాజకీయ పార్టీ చెయ్యలేని సాహసం తమ పార్టీ చేస్తుదన్నారు. సామాన్య ప్రజలతో పాటు, లబ్ది పొందిన టీడీపీ సానుభూతిపరులు కూడా ఇంటికి స్టిక్కర్లు అంటించుకుంటున్నారని చెప్పారు. నెల్లూరు బారా షాహిద్ దర్గా అభివృద్ధికి 15 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడం అభినందనీయమన్నారు.

ఇవి కూడా చదవండి: అయ్యా కొడుకులు పాలిటిక్స్‌లో బీజీ.. నిజామాబాద్ ఘటనపై ఏపీ నేత రియాక్షన్!

Advertisement

Next Story